బిజినెస్

భారత్, మైన్మార్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగన్ (మైన్మార్), డిసెంబర్ 13: భారత్, మైన్మార్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకారం పెరిగిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇరు దేశాలు అనేక రంగాల్లో సహకరించుకుని ముందడుగు వేయాలని ఆయన కోరారు. మైన్మార్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మైన్మార్ ఉపరాష్టప్రతి యూ మియాంటూ స్వీతో చర్చించారు. తయారీ, టెక్నాలజీ రంగంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన సదస్సులో భారత్‌కు చెందిన 50 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్ వాణిజ్యం, పెట్టుబడుల తీరు ఆశాజనకంగా, ప్రోత్సాహకంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ సంబంధాలు విస్తరించాలన్నారు. ఇరు దేశాలు సంయుక్త రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్ నుంచి మియాన్మార్ ఆర్థిక రంగంలో టెక్నాలజీ, పెట్టుబడులను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పరు. మైన్మార్‌లో వౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా పెట్టుబడులను పెట్టడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. యాంగాన్ న ఉంచి ముంబయి, మండలే నుంచి మణిపూర్ వరకు వాణిజ్య సంబంధాలు ప్రత్యక్షంగా నేరుగా ఉండే విధంగా ప్రణాళికను ఖరారు చేయాలన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, డిజిటల్ అనుసంధానం, పారిశ్రామికాభివృద్ధిపై ఇరుదేశాలు దృష్టిని సారించాలన్నారు. మైన్మార్‌లో ఉన్న వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భారతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రపతి కోరారు. ఐటీ, ఫార్మాసూటికల్ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ అగ్రస్థానానికి త్వరలో చేరుకుంటుందన్నారు. నైపుణ్యాభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలపై ఇరుదేశాలు ప్రణాళికను రూపొందించాలన్నారు.

చిత్రం..భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్