బిజినెస్

ఆశాజనకంగా స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 13: స్టాక్ మార్కెట్ ఈవారం ఆశాజనకమైన రీతిలో ముగుస్తుందని ట్రేడింగ్ విధానం స్పష్టం చేస్తున్నది. బుధవారం 629.06 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ గురువారం మరో 150.57 పాయింట్లు (0.42 శాతం) పెరిగి, 35,929.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా లాభాల బాటను కొనసాగించింది. 53.95 పాయింట్లు (0.50 శాతం) పెరగడం ద్వారా 10,791.55 పాయింట్లకు చేరింది. రాజీనామా చేసిన ఉర్జీత్ పటేల్ స్థానంలో శక్తికాంత దాస్‌ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమించడంతో, అస్థిరతకు తెరపడింది. దీనితో ప్రపంచ గ్లోబల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో సానుకూల ధోరణులు ప్రదర్శించకపోయినప్పటికీ, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) మాత్రం లాభాల్లో ముగిసింది. బుధవారంతో పోలిస్తే, ఆ స్థాయిలో బుల్ దూకుడు కనిపించకపోయినప్పటికీ, స్థూలంగా చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నది. విప్రో, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు సగటున మూడు శాతం లాభపడ్డాయి. కాగా, సన్‌ఫార్మా, టీసీఎస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా తదితర కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి.