బిజినెస్

జాబితా నుంచి 10,500 హోటళ్ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత ఆహార భద్రత, నాణ్యత సాధికార కమిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) పలు ఈ-కామర్స్ కంపెనీలపై కొరడా ఝళిపించింది. ఈ క్రమంలో స్విగ్గీ, జొమాటో వంటి అనేక ఈ కామర్స్ కంపెనీలు తమ జాబితాల్లో నుంచి సుమారు 10,500 హోటళ్లను తొలగించివేశాయి. కమిటీ నిబంధనల మేరకు సరైన రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు లేని, ఆహార భద్రతా చట్టాన్ని అతిక్రమించిన హోటళ్లపై ఇలా వేటుపడిందని లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే శుక్రవారం ప్రకటించారు. ఆహార భద్రత, నాణ్యతలకు సంబంధించి గత జూలైలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ ఆన్‌లైన్ ఆహార వ్యాపారం (ఈ-కామర్స్) చేసే కంపెనీలకు కొన్ని స్పష్టమైన నిబంధనలను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే తమ కంపెనీలు అనేక డీఫాల్టర్ హోటళ్లపై చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రభుత్వానికి తెలిపాయి. జొమాటో 2.500, స్విగ్గీ 4000, ఫుడ్‌పాండా 1.800, ఊబర్ ఈట్స్ 2000, ఫుడ్ క్లౌడ్ 200 హోటళ్ల వంతున తమ జాబితాల నుంచి తొలగించివేశాయని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా సభకు వివరించారు. అలాగే ఆహార భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా శాఖ కమిషన్లను సైతం కోరామన్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్సులు లేకుండా ఆహార వ్యాపారం చేసేందుకు ఎవరికీ అధికారం లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపట్ల కమిటీ కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు.