బిజినెస్

కేంద్ర బ్యాంకుకు అటానమీ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 14: ప్రతి దేశంలో కేంద్ర బ్యాంకులకు సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే స్వేచ్ఛ ఉండాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పేర్కొంది. ఈ బ్యాంకులకు స్వేచ్ఛతో పాటు జవాబుదారీతనం కూడా ఉండాలన్నారు. ఆర్‌బీఐ, కేంద్రం మధ్య అగాధం పెరిగిందని వచ్చిన వార్తల నేపథ్యంలో ఐఎంఎఫ్ డైరెక్టర్ గెర్రీ రైస్ చెప్పారు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో శక్తికాంతదాస్ నియమితులయ్యారు. ఉర్జిత్‌పటేల్‌కు, కేంద్రానికి మధ్య మనస్పర్థలు తలెత్తాయని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ డైరెక్టర్ గెర్రీరైస్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బాధ్యతను ఆర్‌బీఐ మోయాల్సి ఉంటుందన్నారు. ఏ దేశంలోనైనా కేంద్రబ్యాంకులకు ఆపరేషనల్ రంగంలో స్వయంప్రతిపత్తి ఉండాలన్నారు. భారత్‌లో ఆర్‌బీఐకు అటానమీ ఉందని, అనేక అంతర్జాతీయ కార్యకలాపాలను చక్కగా నిర్వహించిందన్నారు. రిజర్వు బ్యాంకుకు ఉర్జిత్ పటేల్ గణనీయమైన సేవలు అందించారన్నారు. ఉర్జిత్ పటేల్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన శ్లాఘించారు. అలాగే తాజాగా నియమితులైన గవర్నర్ శక్తికాంతదాస్ సమర్ధులైన ఆర్థిక రంగనిపుణులని, ఆయనతో కలిసి పనిచేస్తామని ఐఎంఎఫ్ పేర్కొంది.