బిజినెస్

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్లపై 2,500 ఎఫ్‌ఐఆర్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఉద్దేశపూర్వకంగా రుణాలను చెల్లించని దివాళా కంపెనీలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గడచిన సెప్టెంబర్ మాసాంతం వరకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్లపై మొత్తం 2,571 ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత బ్యాంకులు నమోదు చేశాయని, అలాగే 9,363 రికవరీ కేసులు (సూట్‌లు)కూడా న్యాయస్థానాల్లో ఉన్నాయన్నారు. 7,616 కేసుల్లో 2002 చట్టం ప్రకారం ఆస్తుల జప్తునకు, లేదా పునురుద్ధరణకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా ఉద్దేశపూర్వక డీఫాల్టర్లు తిరిగి వ్యాపారంలో పుంజుకునే అవకాశాలు వుంటే అందుకు సహకరించాలని నిర్ణయించినట్లు ఓ ప్రశ్నకు సమాదానంగా జైట్లీ చెప్పారు. డీఫాల్టర్లకు బ్యాంకులు, లేదా ఇతర ఆర్థిక సంస్థలు అదనపు రుణాన్ని మంజూరు చేయకూడదన్న రిజర్వుబ్యాంకు నిబంధన ఉండటం వల్ల ఐదేళ్లపాటు ఎలాంటి పురోగతీ లేని అలాంటి సంస్థలపై బ్యాంకులు క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని మంత్రి పార్లమెంటుకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఇలాంటి డీఫాల్టర్ల జాబితాను ఎందుకు బహిరంగంగా ప్రజలకు తెలియజేయడం లేదన్న మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కోటి రూపాయలు, అంతకుమించి రుణం చెల్లించని డీఫాల్టర్ల జాబితాను, అలాగే రూ.25 లక్షలు ఆపైచిలుకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారిపై బ్యాంకులు చట్టపరంగా చర్యలు తీసుకోగా అలాంటివారి జాబితాను బహిరంగంగానే క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీస్ (సీఐసీ)ల పేరిట వెబ్‌సైట్లలో ఉంచడం జరిగిందని, ఐతే సూట్‌ఫైల్ చేయని కంపెనీల పేర్లను బహిర్గతం చేయరాదన్న చట్టం ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటోందని తెలిపారు. కార్పొరేట్ కంపెనీల రుణ బకారుూలు, రైతులకు ఇచ్చిన రుణాలు, నిరర్థక ఆస్తులపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కమర్షియల్ బ్యాంకుల నుంచి 6.29 లక్షల కోట్ల రుణాలు మంజూరైన 568 మందికి సక్రమంగా రుణాలు అందలేదని, 95 మంది మాత్రం గత సెప్టెంబర్ మాసాంతం వరకు 1000 కోట్ల రుణాలు పొందారని వివరించారు. కాగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల కార్యకలాపాల్లో 1.02 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులను సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ గుర్తించిందని మంత్రి వివరించారు.