బిజినెస్

రిజర్వు బ్యాంకు పాలన విధివిధానాలపై పునఃసమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 14: రిజర్వుబ్యాంకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో తొలిసారిగా శుక్రవారం జరిగిన ఆ బ్యాంకు కీలక సెంట్రల్ బోర్డు సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సెంట్రల్ బ్యాంకు పాలనాపరమైన విధివిధానాల (ఫ్రేం వర్క్)పై పునఃసమీక్షించేందుకు అంగీకరించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై, దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎదురవుతున్న సవాళ్లపైనా సమావేశం చర్చించింది. అంతేకాకుండా ద్రవ్యలభ్యత, రుణాల జారీపై, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అవగాహనలపై సమావేశం చర్చించిందని అధికారులు తెలిపారు. అనూహ్యంగా గత సోమవారం ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం రిజర్వుబ్యాంకు 25వ గవర్నర్‌గా బుధవారం దాస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా 2017-18లో బ్యాంకు పురోగతిపై, అప్పటి స్థితిగతులపై రూపొందిన డ్రాఫ్ట్ నివేదికపై కూడా 18 మంది సభ్యుల బోర్డు సమావేశం చర్చింది.
గత బోర్డు సమావేశం నవంబర్ 19న జరగ్గా సుమారు పదిగంటలపాటు జరిగిన చర్చల సందర్భంగా సెంట్రల్ బ్యాంకు ఆర్థిక, మూలధన నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యాంకు ఎంత కంటిజెన్సీ నిధుల నిల్వలను ఉంచుకోవాలి అనే విషయంపై కూడా తేల్చాల్సివుంది. కానీ ఈ నిర్ణయాలేవీ అధికారికంగా బహిర్గతం కాలేదు. కాగా ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీకి చైర్మన్ నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈయేడాది జూన్ నాటికి 9.43 ట్రిలియన్ రూపాయల రిజర్వుబ్యాంకు అదనపునిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాల్సివుండగా ఈ విషయంలో సెంట్రల్ బ్యాంకు, ప్రభుత్వం మధ్య నెలకొన్న బేదాభిప్రాయల నేపథ్యంలో గత గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిష్క్రమించారు. ప్రధానంగా సెంట్రల్ బ్యాంకు మేనేజ్‌మెంట్ నేతృత్వంలో కాకుండా బోర్డు అధీనంలో ఉంచాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ఇది అమలులోకి వస్తే సెంట్రల్ బ్యాంకు నిర్వహణ స్వతంత్రతకు కళ్లెం వేసినట్లే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.