బిజినెస్

తుత్తుకుడి స్టెర్లైట్ ఫ్యాక్టరీని తెరిచేందుకు ఎన్‌జీటీ ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తుత్తుకుడిలో వేదాంత లిమిటెడ్ స్టెర్లైట్ కాపర్ ప్లాంట్‌ను తెరిచేందుకు అనుమతిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శనివారం ఆదేశాలుజారీ చేసింది. అంతకు ముందు తమిళభాడు ప్రభుత్వం మైనింగ్ కంపెనీనీ మూసివేయాలని ఇచ్చిన ఆదేశాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఎన్‌జీటీ చైర్‌పర్సన్ ఏకే గోయల్ అధ్యక్షతన ఏర్పాటైన బెంచి శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. ఈ ఫ్యాక్టరీ కూడా పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై మూడు వారాల్లో నివేదికను మండలికి ఇవివ్వాలని కోర్టు పేర్కొంది. ఈ నెల 10వతేదీన వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ గత ఏడాది పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లుజరిగిన విషయం విదితమే. పోలీసు కాల్పుల్లో పలువురు మృతి చెందారు. కాగా ఎన్‌ఎస్‌జీ తన తీర్పులో స్థానిక ప్రజల సంక్షేమం, పునరావాస సదుపాయాలకు వచ్చే మూడేళ్లలో వంద కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాలని వేదాంత సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది మే 28వ తేదీన తమిళనాడు ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి సీల్ వేసి మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. పర్యావరణ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ట్రిబ్యునల్ పర్యావరణ నిపుణులతో కూడిన బృందాన్ని నియమించింది. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించే ముందు యాజమాన్యంకు వివరణ చెప్పేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని కమిటీ అధ్యక్షుడు మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ అగర్వాల్ ఎన్‌జీకీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.