బిజినెస్

మళ్లీ తెరపైకి బయ్యారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత ప్రచారంలోకి వచ్చిన బయ్యారం గనుల అంశం మళ్ళీ తెరపైకి వస్తోంది. తెలంగాణ ఆవిర్భవం తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకోవాలని పలుమార్లు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీట్ ద ప్రెస్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) మాట్లాడుతూ బయ్యారం ఇనుప ఖనిజం గనుల అంశంపై కేంద్రంతో చర్చిస్తామని ప్రకటించారు. బయ్యారం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే ప్రత్యక్ష, పరోక్షంగా 20వేల మంది యువకులకు ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో దాదాపు 5.342 హెక్టార్లలో బయ్యారం గనులు విస్తరించి ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల, నేలకొండపల్లి మండలాలతో పాటు ఖమ్మం జిల్లా గూడూరు మండలంలో బయ్యారం గనులు ఉన్నాయి. ఇనుప ఖనిజం గనుల విలువ దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ప్రభుత్వ అంచనా. జాతీయాస్థాయిలో బయ్యారం గనులకు ప్రాధాన్యత పెరిగింది. దేశంలో స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం ముడి సరుకుగా ఉపయోగపడుతోంది. బయ్యారం గనులకు విపరీతమైన గిరాకీ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ అంతర్జాతీయంగా ఎంతో పేరుంది. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి అన్ని రాజకీయ పార్టీలూ ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించి సాధించుకున్నాయి. ‘బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గళమెత్తింది. ప్రజాఫ్రంట్ నేతలు సైతం బయ్యారం గనుల అంశాన్ని ప్రచారంలో ఉపయోగించుకున్నారు.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే బయ్యారం గనులు అంశం బయటి ప్రపంచానికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బయ్యారం గనుల లీజులను స్థానిక గిరిజనులు అప్పగించారు. 63 ఎకరాలను అప్పగిస్తూ అప్పట్లో అనుమతులు ఇచ్చింది. అయితే ఎలాంటి తవ్వకాలూ జరగలేదు. 2004 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయ్యారం గనుల లీజులను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్( ఎపీఎండీసీ)తో పాటు రక్షణ ప్రైవేట్ సంస్థతో జాయింట్ వెంచ్‌ర్‌తో బయ్యారం గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. వైఎస్ ప్రభుత్వం జీవోలు జారీ చేసినా పనులు మాత్రం చేపట్టలేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కే రోశయ్య అధికారం చేపట్టినప్పటికీ బయ్యారంపై ఇచ్చిన జీవోలు రద్దుచేయలేద.. అలాగే కొత్త ఉత్తర్వులు ఇవ్వలేదు. చివరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి బయ్యారం గనులపై ఇచ్చిన జీవోలను రద్దు చేస్తూ.. గనుల నుంచి ఇనుప ఖనిజంను విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు సరఫరా చేయాలని జీవో జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ బయ్యారం గనుల అంశంపై మాట్లాడడం, శనివారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గనుల విషయంపై చర్చిస్తామని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.