బిజినెస్

హోటళ్ల వ్యాపార రంగానికి ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: హోటల్ వ్యాపార రంగం (హాస్పిటాలిటీ ఇండస్ట్రీ)కి ఉజ్వల భవిష్యత్తు ఉందని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఈ రంగం రానున్న నాలుగైదేళ్లలో 9 నుంచి 10 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయంటున్నారు. గృహావసరాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా సరఫరా జరగడం లేదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ రంగంలో ఆదాయాభివృద్థితోబాటు పెట్టుబడుల విస్తరణ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 10 నుంచి 12 శాతం అదనంగా జరిగే అవకాశాలున్నాయని నివేదించింది. వచ్చే యేడాది గృహ వినియోగంతోబాటు, విమాన కనెక్టివిటీ, గృహాలకు వెలుపల ఫంక్షన్లు చేసుకునే సంస్కృతి మరింతగా పెరుగుతుందని విశే్లషించింది. కార్పొరేట్ సంస్థల పనితీరులోనూ ఈ విషయంలో గడచిన పది త్రైమాసికాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోందని పేర్కొంది. అయితే ఆహార సరఫరా విభాగంలో మాత్రం వచ్చే ఐదేళ్ల కాలంలో 3.6 శాతం తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ఇక్రా అంచనావేసింది. అయితే 2023 నాటికి 12 ముఖ్య నగరాల్లో పెరిగే అవసరాల నేపథ్యంలో సరఫరా విభాగం సైతం పుంజుకునే వీలుందని అంచనావేసింది. డిమాండ్ అండ్ సప్లే గ్యాప్ మాత్రం 1 శాతం నుంచి 2023 నాటికి 5శాతానికి పెరిగుతుందని విశే్లషించింది. మధ్య తరహా వ్యాపార రంగంలో వడ్డీలు, రుణాలు సైతం క్రమంగా పెరుగుతాయని, అయితే 2020 నాటికి ఈ రంగంలో అంతగా ఉపాధి అవకాశాలు పెరగవని నివేదిక పేర్కొంది. కాగా 2019 జనవరి మాసంలో కొత్త ధరల నిర్ణయం జరిగాక కూడా తదనుగుణంగా మార్కెట్ వృద్ధి జరిగే అవకాశాలున్నాయని ఇక్రా ఉపాధ్యక్షురాలు పవిత్రా పొన్నయ్య అభిప్రాయపడ్డారు.