బిజినెస్

కావాలనే అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదరా, డిసెంబర్ 16: విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏ ప్లాంటుకూ బొగ్గు కొరత లేదని, వాస్తవానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు గత అక్టోబర్ మాసంలో 8 నుంచి 9 శాతం అధికోత్పత్తి చేశాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయిందంటూ ఏ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచీ ఫిర్యాదులు రాలేదన్నారు. నేషనల్ మైనర్ కోల్ ఇండియా ద్వారా ఈ యేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 22 మిలియన్ టన్నుల బొగ్గును విద్యుత్ ఉత్పాక ప్లాంట్లకు సరఫరా చేయడం జరిగిందని, ప్రస్తుతం అన్ని ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని మంత్రి వివరించారు. విద్యుత్ ఉత్పాదనలో 8 నుంచి 9 శాతం అధికంగా బొగ్గు వినియోగం జరుగుతోందన్నారు. రైల్వే మంత్రి త్వ శాఖను సైతం నిర్వహిస్తున్న గోయెల్ తొలి రైల్వే విశ్వ విద్యాలయాన్ని ఇక్కడి ప్రతాప్ సింగ్ ప్యాలెస్‌లో జాతికి అంకితం చేసే కార్యక్రమానికి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పీటీఐకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఇలావుండగా బొగ్గు నిల్వల విషయంలో అధికారుల వివరణ మరోలా వుంది. ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్ర విద్యుత్ కంపెనీ అధికారుల కథనం మేరకు వనక్‌బరీ, గాంధీనగర్, ఉకాయ్ పవర్ ప్లాంట్లకు గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో బొగ్గు కొరత ఏర్పడి నెలవారీ ఉత్పానకన్నా తక్కువగా విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అయితే దీపావళి నుంచి సమస్య తీరింది. ఇండోనేషియా నుంచి అదనంగా బొగ్గు దిగుమతి చేసుకోవాలన్న డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడా అవసరం లేదని మంత్రి చెబుతున్నారు.