బిజినెస్

రిజర్వ్ బ్యాంకుపై ప్రభుత్వ ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, డిసెంబర్ 17: రిజర్వుబ్యాంకుపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సుస్థిర వత్తిడిని పెంచుతున్న క్రమంలో ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరి గత కొనే్నళ్ల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థపై, దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థితిగతులపై విపరీత ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ సోమవారం హెచ్చరించింది. ఇటీవల రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవి నుంచి ఉర్జిత్ పటేల్ వైదొలగడం మరింత ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా ఆ రేటింగ్స్ ఏజెన్సీ అంచనావేసింది. ‘వచ్చే జనవరిలో జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశానంతరం బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణకు సంబంధించిన మార్పులేవైనా చోటుచేసుకుంటాయా అనేది వేచిచూడాల్సివుంద’ని ఆ ఏజెన్సీ పేర్కొంది. రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవి నుంచి ఉర్జిత్ పటేల్ తప్పుకున్న తర్వాత సెంట్రల్ బ్యాం కు స్వతంత్ర ప్రతిపత్తి, స్వేచ్ఛపై మాట్లాడటం తెరమరుగైందని ఆ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతానికి సెం ట్రల్ బ్యాంకు స్వతంత్రత విషయంలో ఎలాంటి మార్పులూ జరగలేదని, ప్రత్యేకించి వివేకవంతమైన విధానాన్ని దత్తత తీసుకోవడంగానీ అమలు చేయడం కానీ అవసరం లేదని అభిప్రాయపడింది. ‘ఆర్బీఐకి ఇతర ప్రాంతీయ బ్యాంకులకంటే సంప్రదాయబద్ధంగా అధిక స్వతంత్రత, సంస్థాగతమైన సంస్కృతి ఉంద’ని ఈ ఏజెన్సీ గుర్తుచేసింది. ఐతే ప్రభుత్వ వత్తిడితో వీటి మనుగడకు భంగం కలగడంతోబాటు దేశ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఎస్ అండ్ పి విశే్లషించింది. ‘ఇది నిజంగా ఓ క్లిష్టతరమైన పరిస్థితి, సెంట్రల్ బ్యాంకు గుర్తింపు, పునరుద్ధరణ, దృఢ సంకల్పం, సంస్కరణ అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా ఆర్థిక రంగంలో ఆరోగ్యకరమైన మార్పులకోసం కృషి చేస్తోంద’ని ఆ ఏజెన్సీ కితాబునిచ్చింది. ఆర్బీఐ కొన్ని సంవత్సరాల నుంచి అనురిస్తున్న విధానాలతో బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరులో బాధ్యత, పారదర్శకత పెరిగిందని, ప్రత్యేకించి గతంలో పనిచేసిన గవర్నర్ రఘురాం రాజన్ ఆస్తుల పై చేపట్టిన నాణ్యతతోకూడిన ఫలవంతమైన సమీక్షల నుంచి ఆర్బీఐ పనితీరులో సానుకూల వైఖరి పెరిగిందని పేర్కొంది. వత్తిడికి గురైన ఆస్తుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇదివరకు ఉన్న పలు పథకాలకు తిలోదకాలిస్తూ ఈ యేడాది ఫిబ్రవరి12న ఆర్బీఐ సర్క్యులర్ జారీచేసినప్పటి నుంచి నిరుపయోగ ఆస్తుల గుర్తింపు బాగా పెరిగిందని ఎస్ అండ్ పీ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల మూలధన పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని ఈ విషయంలో రిజర్వుబ్యాంకు వ్యవహార శైలి బాగుందని, నిరర్థక ఆస్తుల గుర్తింపు మరో 12నుంచి 18 నెలల వ్యవధిలో పూర్తవుతుందని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా ఆర్బీఐ అధికారులపై ఆంక్షలు విధించడం సరికాదన్నది తమ అభిప్రాయమని ఎస్ అండ్ టీ పేర్కొంది.