బిజినెస్

నష్టాలను చవిచూసిన ఆరు ప్రధాన కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అత్యంత విలువైన ఆస్తులు కలిగిన టాప్‌టెన్ జాబితాలోని ఆరు కంపెనీలు గత వారం నష్టాలను చవిచూశాయి. మార్కెట్ విలువలో ఈ కంపెనీలు మొత్తం 89,531 కోట్ల రూపాయలను కోల్పోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆస్తుల విలువ సైతం 34 వేల కోట్లకు తగ్గిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), ఇన్‌ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, మారుతీ సుజుకీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం లాభాలతో వారాన్ని ముగించాయి. డీసీఎస్ మార్కెట్ విలువ సైతం సుమారు 7,11.921 రూపాయలు నష్టపోయి 34,521 కోట్లకు చేరింది. అలాగే ఇన్ఫోసిస్ 2,62,105.44 కోట్లు నష్టపోయి 26,143,34 కోట్లకు చేరింది.
ఇక హిందూస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ 3,90,416.08 కోట్లు నష్టపోయి 11.515.94 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ ఇండియా లిమిటెడ్ 6,96.195.94 కోట్ల భారీ మొత్తాన్ని నష్టపోయి 8,493.67 కోట్ల రూపాయలకు పడిపోయింది. కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన ఎంక్యాప్ 2,34.087.97 కోట్ల రూపాయలు నష్టపోయి 5.311.51 కోట్లకు చేరగా, మారుతీ సుజుకీ 3,544.91 కోట్ల భారీ మొత్తాన్ని నష్టపోయి విలువ 2,27,670.19 కోట్లకు చేరింది.
లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ
గడచిన వారంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ 7,823.28 కోట్ల రూపాయల లాభాలను సంతరించుకుని మొత్తం విలువ 3,35,165.94 కోట్లకు చేరింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తుల విలువ 2,231.15 కోట్లు పెరిగి మొత్తం 2,60,285.60 కోట్ల రూపాయలకు చేరింది.
ఇక ఇండియన్ టొబాకో కంపెనీ (ఐటీసీ) సైతం రూ.1,040.83 కోట్లు లాభపడి మొత్తం విలువ 3,38,575.91 కోట్లకు చేరింది. ఇక ర్యాంకింగ్ విషయానికి వస్తే టాప్ టెన్ కంపెనీల జాబితాలో ఎం-కాప్, టీసీఎస్ అగ్రస్థానాన్ని (నంబర్ వన్) ఆక్రమించాయి. తర్వాతి స్థానాల్లో రిలయన్స్ ఇండియా లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఇన్‌ఫోసిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు, మారుతీ సుజుకీ నిలిచాయి.