బిజినెస్

ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆదిత్య బిర్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): ఆంధ్రప్రదేశ్‌లో విస్కాస్ ఫైబర్ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ వీఎస్‌ఎఫ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదిత్య బిర్లా ప్రతినిధులు తెలిపారు. ఈ పరిశ్రమల కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెల్వులోజ్ అనే పునరుత్పాదక ముడి పదార్థం నుండి ప్రపంచశ్రేణి ప్రమాణాలతో పర్యావరణ హితమై నారను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. టెక్స్‌టైల్ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న బిర్లా గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా ఐదొందలకు పైగా సంస్థల్లో చెయిన్ పార్టనర్లుగా ఉన్నట్లు ప్రతినిధులు చెప్పారు. అన్ని అనుమతలు లభిస్తే ఈ పరిశ్రమ మొదటి దశను 24 మా సాల్లోనే పూర్తి చేస్తామన్నారు. ఈ రంగంలో బిర్లాకు 70 ఏళ్ల అనుభవం ఉందని వివరించారు. నాయుడుపేటలో 2వేల ఏకరాలు సి ద్ధంగా ఉందని ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిపాదిత భూము ల్ని పరిశీలించి రావాలని ఆదిత్య బిర్లా గ్రూ ప్‌కు ముఖ్యమంత్రి సూచించారు.