బిజినెస్

ఇనె్వస్టర్ ఫెయిర్‌తో వ్యాపార సంస్థలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: ఇనె్వస్టర్ ఫెయిర్ ద్వారా వ్యాపార సంస్థలకు మేలు జరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వుడా చిల్డ్రన్ థియేటర్‌లో గురువారం నిర్వహించిన నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇనె్వస్టర్ ఫెయిర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇనె్వస్టర్ ఫెయిర్-2019 ద్వారా విద్యార్థులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల యజమానులు, ఆర్థిక సలహాదారులకు అత్యుత్తమ భవిష్యత్‌కు ఉపయుక్తమైన ఆర్థిక వనరులపట్ల అవగాహన కల్పించనున్నారన్నారు. ఈ ఇనె్వస్టర్ ఫెయిర్‌కు హాజరైన వారు ఆర్థిక ప్రణాళిక అనే అంశంపై తమకు లభించిన మార్గ నిర్దేశకత్వం ద్వారా విశాఖ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నామన్నారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు ఈక్విటీల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నంలో ఇనె్వస్టర్ ఫెయిర్‌ను నిర్వహించడం మంచి ఫలితాలనిస్తుందన్నారు. ఆయా పోటీల్లో విజేతులకు మంత్రి గంటా చేతులమీదుగా మెడల్స్, సర్ట్ఫికెట్లు అందజేశారు. ఆర్థిక మార్కెట్‌లో ఉపాధి, ఎస్‌ఎంఈ ఫండింగ్, భారతీయ వృద్ధి, ఫైనాన్షియల్ మార్కెట్లు అనే అంశాలపై చర్చించారు.
చిత్రం..విశాఖ వుడా చిల్డ్రన్ థియేటర్‌లో గురువారం నిర్వహించిన ఇనె్వస్టర్ ఫెయిర్‌లో మాట్లాడుతున్న మంత్రి గంటా