బిజినెస్

రూ.2 వేల నోట్ల ముద్రణ తగ్గింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2000 కరెన్సీ నోట్ల ముద్రణను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చలామణిలోకి తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ వివరాలను ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేశారు. నోట్ల కొరత తలెత్తడంతో ప్రభుత్వం రూ.2000 కరెన్సీని చలామణిలోకి తెచ్చింది. కరెన్సీ నోట్ల చలామణిని బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ మేరకు నోట్లను ముద్రించాలో ఆర్థిక నిపుణులను చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. రూ.2000 కరెన్సీనోట్ల ముద్రణను ఇకపై తగ్గిస్తారు. ఇదేమీ కొత్త విషయం కాదని ఆర్‌బీఐ అధికారులు చెప్పారు. ప్రస్తుతం 3285 మిలియన్ల రెండు వేల రూపాయల కరెన్సీనోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ సంఖ్య 2017 మార్చి వరకు ఉంటే, 2018 మ ఆర్చి నాటికి 3363 మిలియన్లకు పెరిగాయి. దేశంలో 2018 మార్చి 31వ తేదీ వరకు రూ.18037 బిలియన్ల నోట్లు కరెన్సీ చలామణిలో ఉన్నాయి. ఇందులో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్ల వాటా 37.3 శాతం ఉన్నాయి. 2017తో పోల్చితే వీటి శాతం 50.2 శాతం నుంచి 37.3 శాతానికి తగ్గించారు.