బిజినెస్

ఇష్యూ పరిమాణంలో మార్పులకు సెబీ కొత్త నిబంధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఇష్యూల అంచనాల పరిమాణాన్ని సవరించ దలచుకునే సంస్థలు కొత్తగా ఆఫర్ డాక్యుమెంట్లు దాఖలు చేసేలా మార్కెట్ రెగులేటర్ సెబీ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ నిబంధనల మేరకు మార్కెట్‌లో విడుదల చేసిన ఇష్యూ అంచనాలను 20 శాతం అధికంగా, లేదా తక్కువగా మార్పు చేయాలనుకునే పక్షంలో సరికొత్త ఆఫర్ డాక్యూమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుందని సెబీ శుక్రవారం విడదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం కొత్త ఇష్యూలతోబాటు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎప్‌సీ)లకు ఈ డాక్యుమెంట్ దాఖలు చేయాలన్న నిబంధన ఉంది. ఇందులో ఓఎఫ్‌ఎస్‌కు సంబంధించి ఒకవేళ ఆఫర్ చేసిన (అమ్మకానికి పెట్టిన) షేర్ల మొత్తంలో 50 శాతం కన్నా మార్పులు ఉంటే లేదా ఇష్యూ అంచనాల్లో మార్పులు ఉంటే సరికొత్త ఆఫర్ డాక్యుమెంట్లను సంబంధిత సంస్థలు సమర్పించాల్సి వుంటుందని సెబీ స్పష్టం చేసింది.
పద్దుల ప్రాతిపదికన కాకుండా ఇతర మార్గాల్లో ఇష్యూను రూపొందించిన పక్షంలో కనీసం 50 శాతం వాటాలను రీటెయిల్ మదుపర్లకుకు కేటాయించాలని, మిగిలింది వ్యక్తిగత దరఖాస్తుదారులకు, కార్పొరేట్ సంస్థలకు, లేదా విభాగాలకు కేటాయించడం జరుగుతుందని సెబీ వెల్లడించింది. దరఖాస్తు చేసిన సెక్యూరిటీలకు అతీతంగా ఈ కేటాయింపులు జరుగుతాయి. కాగా ఈ కొత్త నిబంధనలకు మరింత బలం చేకూర్చేందుకు సెబీ తన మూలధన, వెల్లడించ దగిన అవసరాలకు సంబంధించిన నియంత్రణలకు సవరణ చేసింది.