బిజినెస్

మందగించిన సేవల రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 4: దేశంలో సేవల రంగం అనుకున్న స్థాయిలో లేకపోగా, మందగించడం పలు వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది. నవంబర్‌లో 53.3 శాతంగా ఉన్న సేవల సూచీ డిసెంబర్‌లో 52.7 శాతానికి పడిపోయింది. ఈ పరిణామంతో సేవల రంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. అదే విధంగా కొత్తగా ఈ రంగంలో ఉపాధిని వెతుక్కునే వారు కూడా తమ భవిష్యత్తుపై స్పష్టత కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చ్తేన్నారు. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం, తాజాగా నిర్వహించిన సర్వేల ఫలితాల ప్రకారం దేశంలో సేవల రంగమే ఉపాధి కల్పనలో మిగతా రంగాల కంటే అగ్రస్థానంలో ఉంది. ఎక్కువ మందికి ఉద్యోగ కల్పన కూడా సేవల రంగం వల్లే సాధ్యమవుతున్నది. దేశంలో సేవలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా, భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్‌లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదిరి 47.8, అదే విధంగా మే మాసంలో నమోదైన 49.6 శాతం వంటి కనిష్టస్థాయి కాదని గుర్తుచేస్తున్నారు. కాబట్టి, త్వరలోనే ఈ రంగం కోలుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సేవల రంగంలో అభివృద్ధి కుంటుపడడం ఆందోళన కలిగిస్తున్న అంశమే.