బిజినెస్

చివరి రోజు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 4: ఈవారానికి చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు ఊరట లభించింది. వరుస నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్ కొంత వరకు మెరుగుపడింది. 181.39 పాయింట్లు ఎగబాకి, 35,695.10 పాయింట్ల వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో కొనసాగిన పతనం శుక్రవారం కూడా తప్పదనే అభిప్రాయం బలంగా వినిపించింది. కానీ, అందుకు భిన్నంగా ఉదయం ట్రేడింగ్ మొదలైన తర్వాత అమ్మకాల ఒత్తిడి తగ్గి, మార్కెట్ కొనుగోళ్లతో సందడిగా మారింది. సిఫ్టీ కూడా 55.10 పాయింట్లు లాభపడడంతో 10,727.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మొత్తంలో సెనె్సక్స్ 381.62 పాయింట్లు, నిఫ్టీ 132.55 పాయింట్లు నష్టపోయిన నేపథ్యంలో, వారాంతం కొంత మెరుగైన పరిస్థితి కనిపించడం ట్రేడర్ల ఆశలకు ఊతమిచ్చింది. ఎస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, వేదాంతా, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు 3.05 శాతం లాభాలను ఆర్జించాయి. అయితే, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్,డస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా తదితర కంపెనల షేర్లు సగటున 1.55 శాతం నష్టాలను చవిచూశాయి. వివిధ రంగాలను పరిశీలిస్తే, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, మెటల్, ఫార్మా సూచీల ర్యాలీ కొనసాగింది. వీటిలో చాలా వరకు రంగాలు రెండు శాతాన్ని మించిన లాభాలను నమోదు చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సగటున 4 శాతం లాభాన్ని సంపాదించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూలంగా స్పందించాయి. వచ్చేవారం ఆరంభంలో అమెరికాకు చెందిన అధికారుల బృందం చైనా వెళ్లి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుపుతుంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ స్థూలంగా ఒక అవగాహనకు రావడంతో సమస్యకు తెరపడుతుందనే అభిప్రాయం ఇరు వర్గాల్లో కనిపిస్తున్నది. కాగా, ఈ పరిణామం స్టాక్ మార్కెట్‌కు అనుకూలించింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) అందించిన వివరాల ప్రకారం విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) 972.81 కోట్ల రూపాయల షేర్లను అమ్మారు. అయితే, దేశీయ మదుపరులు కొనుగోళ్లను కొనసాగించారు. వీరు కొన్న వాటాల విలువ 34.52 కోట్ల రూపాయలు. ఇలావుంటే, ఫోరెక్స్ మార్కెట్ శుక్రవారం కొంత బలపడింది. 33 పైసలు మెరుగు కావడంతో డాలర్ విలువ 69.87 రూపాయలుగా నమోదైంది.