బిజినెస్

వడ్డీ రేట్లు తగ్గిస్తే యూకేను అధిగమించనున్న భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: బ్యాంకు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గడంతోపాటు వడ్డీ రేట్లను తగ్గిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థలో యూకేను అధిగమించే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే దేశ సాధారణ ఎన్నికల్లోగా కీలమైన వడ్డీరేట్లను తగ్గించే దిశగా పూనుకుంటే భారత్ యూకే కంటే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది 2.8 శాతం ప్రపంచ వృద్ధి పెరగవచ్చునని నోమురా హోల్డింగ్ అంచనా వేసింది. భారత్‌లో ఎగుమతి, మాన్యుఫాక్చరింగ్, పెట్టుబడులు వంటివి బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకుంటే 2018లో భారత అభివృద్ధి రేటు ఎంతో పెరిగిందని తెలిపింది. అదేవిధంగా ఈ ఏడాది సైతం అతి పెద్ద యూకేను అధిగమించి ప్రపంచంలోనే ఐదో స్థానంలో భారత్ నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.