బిజినెస్

భారత్‌కు నేను రాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ని నిండాముంచేసి విదేశాల్లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ స్వదేశం రావడానికి సాకులు వెదుకుతున్నాడు. పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాని నిందితుడైన నీరవ్ భారత్‌లో తనకు భద్రత లేదని, అందుకే రాలేనని శనివారం కోర్టుకు తెలిపాడు. పైగా రాజకీయ దురుద్దేశంతోనే తనను కేసులో ఇరికించారని ఆయన ఆరోపించాడు. మలీలాండరింగ్ కేసులో నీరవ్‌ను పరారైన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ ప్రత్యేక కోర్టును కోరింది. దీనికి నీరవ్ తరఫున్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. తనపై దాడి జరుగుతుందన్న భయం తన క్లయింట్ వ్యక్తం చేస్తున్నారని, భారత్‌లో తగిన భద్రత లేదన్న అనుమానం ఉన్నందున స్వదేశానికి తిరిగి రావడం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నీరవ్ మోదీ దిష్టిబొమ్మలు దహనం చేసిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. రాజకీయ లబ్ధికోసం కేసును తప్పుదోవపట్టిస్తున్నారని నీరవ్ న్యాయవాది ఆరోపించారు. ఎప్పుడో విదేశాలకు వెళ్లిపోయిన వ్యక్తిపై ఈడీ ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించిందని ఆయన అన్నారు. కాగా ఈడీ నోటీసులకు తాను సమాధానాలు ఇస్తునే ఉన్నానని మోదీ వెల్లడించాడు. అయితే ఈడీ సమన్లకు నీరవ్ స్పందించడం లేదని, మూడు సార్లు తప్పించుకున్న సంఘటనలున్నాయని అధికారులు వెల్లడించారు. లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లు సృష్టించి నీరవ్‌మోదీ, ఆయన బంధువుమెహుల్ ఛోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 14వేల కోట్లకు ముంచేశారు. ఈమేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. నీరవ్, ఆయన బంధువుఛోక్సీ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు.