బిజినెస్

8, 9 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో సమ్మెకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత, పెన్షన్ ప్లాన్ వంటి పలు డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించాల్సిందిగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) పిలుపునిచ్చాయి. 10 కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించి, రెండు రోజుల సమ్మెకు దిగుతున్నట్టు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ)కు నోటీసు ఇచ్చాయి. బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)కి అంద చేసిన ఫైలింగ్‌లో ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ధ్రువీకరించాయి. కాగా, రెండు రోజుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు స్తంభించనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు పని చేసినా, దేశంలో ఎక్కువ మంది ఖాతాదారులను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె అనేకానేక లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా, డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు లేదా అధికారులు సమ్మెబాట బాటపట్టడం రెండు నెల వ్యవధిలో ఇది మూడోసారి. తమ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నదని ఆరోపిస్తూ, భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఏఐబీఓసీ) గత నెల 21న ఒక రోజు సమ్మె చేసింది. కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 26న ఉద్యోగులు, అధికారులు తమతమ విధలను బహిష్కరించారు. విలీనాల వల్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించిన తర్వాత, ఉద్యోగ భద్రతపై అనుమానాలు తొలగినప్పటికీ, మిగతా డిమాండ్లపై ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. తాజాగా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎఐసీసీటీయూ, యూటీయూసీ, టీయూసీసీ, ఎల్‌పీఎఫ్, సెవా సంఘాలు తాజాగా సమ్మెకు పిలుపునిచ్చాయి. రెండు రోజులపాటు పెద్ద ఎత్తున సమ్మె జరగనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాలు ఎక్కడివక్కడ స్తంభించడం ఖాయంగా కనిపిస్తున్నది.