బిజినెస్

దేశ ఆర్థిక స్థిరత్వానికి విఘాతంగా ముడిచమురు ధరల పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: గడచిన యేడాది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అమాంతం పెరగడం దేశ స్థూల వార్షికావృద్ధి పరుగుకు పగ్గాలు వేసేదిగా మారిందని, ప్రస్తుత వార్షిక నష్టాల పద్దు (సీఎడీ)ని ఇది మరింతగా పెంచుతుందని రిజర్వు బ్యాంకుకు చెందిన ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం, వార్షిక ఆదాయ పరిస్థితులు పరికిస్తే దేశ ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారే అవకాశం ఉందని ఆ నిపుణుల అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా అవసమైన ముడిచమురును 80 శాతం విదేశాల నుంచి కొనుగోలు చేస్తుండటం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని పేర్కొంది. ప్రత్యేకించి సీఏడీతోబాటు, ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణాన్ని, ఆర్థిక లోటును మరింతగా పెంచే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో గత యేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య ముడిచమురు ధరలు 12 శాతం పెరిగాయి. అప్పట్లో దేశ అవసరాలు సైతం పెరగడంతోబాటు, అంతర్జాతీయ రాజకీయ విభేదాలు వల్ల మరింత సమస్యాత్మకమైంది. అయితే గత నవంబర్ నెల ద్వితీయార్థం నుంచి ముడి చమురు ధరల్లో తగ్గుదల ప్రారంభమైంది. కానీ తగ్గుదలలో స్థిరత్వం కరవైంది. ‘మొత్తానికి ముడి చమురు ధరల పెరుగుదల కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ (సీఏడీ)ని ప్రభావితం చేయడంతోబాటు దేశ సమగ్రాభివృద్ధిని కొనసాగించే అంశాలను బలోపేతం చేయలేకపోయింది. అందువల్ల ప్రస్తుతం ఇటు ద్రవ్యోల్బణంతోబాటు, స్థూల వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం పడుతోందని సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఆర్థిక నిపుణులు రూపొందించిన ‘సీఏడిపై ముడిచమురు ధరల పెరగుదల ప్రభావం, ద్రవ్యోల్బణం, వార్షిక ఆర్థిక లోటు’ అనే అధ్యయన నివేదిక తెలుపుతోంది. చమురు ధరల్లో క్లిష్టతరమైన పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 85 అమెరికన్ డాలర్లు పలికినపుడు మనదేశ కొనుగోళ్లపై మొత్తం 106.4 బిలియన్ డాలర్ల వరకు పద్దుల రూపేణా నష్టాలు వచ్చాయని, ఇది దేశ స్థూల వృద్ధిరేటుకు 3.61 శాతం తగ్గుదల అని నివేదిక వివరించింది. అలాగే ప్రతి పది బ్యారళ్ల కొనుగోలుపై అదనంగా పెరిగిన ధరలతో 12.5 బిలియన్ డాలర్ల నష్టం నమొదైందని నివేదిక వెల్లడించింది. ఇది సుమారు 43 బేసిక్ పాయింట్ల (బీపీఎస్) వంతున దేశ స్థూల ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగించిందని వివరించింది. అదే క్రమంలో 10 బ్యారెళ్ల నుంచి 65 బ్యారళ్ల కొనుగోలుకు వచ్చే సరికి నష్టం 49 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుందని పేర్కొంది. కాగా పెరిగిన ధరలు వినియోగదారుడిని ప్రభావితం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే స్థూలాదాయంపై మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉందని, అయితే తదుపరి స్థానిక మార్కెట్లలోప్రభుత్వం విధించే చార్జీలు, పన్నులు తదితరాలను అనుసరించి ద్రవ్యోల్బణం, వార్షిక ఆర్థికలోటు ఉంటుందని నివేదిక పేర్కొంది.
రూ.83వేల కోట్ల ఉపసంహరణ న్యూఢిల్లీ, జనవరి 6: ప్రధాన మార్కెట్ల నుంచి గడచిన యేడాది 83 వేల కోట్ల రూపాయలు మదుపర్లు వెనక్కు తీసుకున్నారు. అదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు మదుపు చేశారు. అమెరికాలో ధరల పెరుగుదలతోబాటు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువలో తగ్గుదల పెట్టుబడులపై ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో సైతం ఈ పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని, అయితే ఈ విషయంలో మదుపర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని, దేశంలో ఆర్థిక స్థితిగతులు స్థిరంగా బలోపేతం అయ్యే వరకు కొంత వేచిచూసే దోరణిని అవలంభిస్తారని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడే స్థిరమైన ప్రభుత్వంపై సైతం ఈ పడుబడుల రాక ఆధారపడి ఉంటుందని మార్నింగ్ స్టార్ ఇనె్వస్‌మెంట్స్ సలహాదారు, సీనియర్ విశే్లషకుడు హిమాంన్షు శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. 2018లో భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇనె్వస్టర్లు మొత్తం 83,146 కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. ఇందులో రూ.33,553 కోట్లు ఈక్విటీల నుంచి రూ.49,593 కోట్ల రూపాయలు రుణ మార్కెట్ల నుంచి వెనక్క తీసుకున్నారని డిపాజిటర్ల వద్ద ఉన్న గణాంకాలు తెలుపుతున్నాయి. 2002 నుంచి ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడుల విషయంలో ఇదే అతి తక్కువ సంవత్సరంగా నిలిచింది. విదేశీ నిధులను చిన్న మార్కెట్లలోగాక, ఇతర మార్కెట్లకు మంజూరు చేయడం సైతం పెట్టుబడులపై ప్రభావం చూపిందన్నారు. గడచిన ఆరేళ్ల కాలంలో విదేశీ మదుపర్లు వరుసగా అధిక మొత్తంలో భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. 2017లో 51 వేల కోట్లు, 2016లో 20.500 కోట్లు, 2015లో 17,800 కోట్లు, 2014లో 97 వేల కోట్లు, 2013లో 1.13 లక్షల కోట్లు 2012లో 1.28 లక్షల కోట్లు వంతున పెట్టుబడులు వెనక్కు తీసుకోవడం జరిగింది. కాగా 2016లో 43,600 కోట్ల రూపాయలు వెనక్కు తీసుకున్న విదేశీ మదుపర్లు 2017లో పెద్దయెత్తున ముందుకు వచ్చి 1.5 లక్షల కోట్ల భారత మార్కెట్లలోకి పెట్టుబడులు పెట్టారు. 2018లో సైతం బాగానే ముందుకు వచ్చినప్పటికీ అంతర్జాతీయ స్థితిగతులు, ధరల ప్రభావతో పెట్టుబడుల్లో తిరోగమనం ఆరంభమైంది. మార్చిలో కొంత తేరుకున్నా వాటాల అమ్మకాలు కొనసాగుతూనే వుందని బజాజ్ కేపిటల్ సీఈవో రాహుల్ పరీక్ తెలిపారు.2008 నుంచి ఇప్పటి వరకు తొలిసారిగా సెంట్రల్ బ్యాంకులు ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ద్రవ్యాన్ని వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఇలా మరో ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.