బిజినెస్

ఫెడెక్స్‌కు ఫార్చూస్ మేగజైన్ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: పెడెక్స్‌కు ఫార్చూస్ మేగజైన్ గుర్తింపు లభించింది. 2018 బెస్ట్ వర్క్‌ప్లేసెస్ ఫర్ డైవర్సిటీ జాబితాలో (వైవిధ్యత గల ఉత్తమ కార్యాలయాలు 2018లో) స్థానం లభించింది. మహిళలు ఎదుర్కొన్న అనుభవాలు, వ్యక్తుల వర్ణం (లెస్బియన్, గే, బై-సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) సమాజంలోని సభ్యులు, బూమర్స్ (1946-55 మధ్య జన్మించిన వారు), వయో వృద్ధుల సంఖ్య ఆధారంగా వైవిధ్యతను గుర్తిస్తుందని ఫెడెక్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. వైవిధ్యాన్ని, అన్ని వర్గాల వారిని మిళితం చేయడంలో తాము చూపిన నిబద్ధత కారణంగానే ఈ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని తెలిపింది. సంస్థలోని సభ్యులే, అత్యుత్తమ ఆస్థి అని భావిస్తున్నామని పెడెక్స్ పేర్కొంది.