బిజినెస్

వరుసగా రెండోరోజూ లాభాల్లో ఈక్విటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 7: ఈక్విటీ బెంచ్ మార్కు సెనెక్స్ సోమవారం 155 పాయింట్లు ఎగబాకి 35,850 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు దోహదం చేశాయని, ప్రధానంగా చైనా-అమెరికా వాణిజ్య బంధాలు మెరుగవుతాయన్న సంకేతాలు భారత మార్కెట్లకు ఊతమిచ్చాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశీయ మార్కెట్లలో ద్రవ్య లభ్యత, రానున్న రోజుల్లో అధిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేసిందని అంటున్నారు. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తొలుత తన లాభాల పరుగుకు కొనసాగింపుగా ఆరంభమై 36,000 మార్కును మళ్లీ దాటి 36,076.95 వద్ద పరుగులు తీసింది. ఐతే చివరి నిమిషాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతోబాటు, యూరోపియన్ మార్కెట్లలో బలహీన పరిస్థితులు నెలకొనడంతో సెనె్సక్స్ స్వల్పంగా దిద్దుబాటుకు గురై 155.06 పాయింట్లు అధిక్యంతో 0.43 శాతం లాభాలతో 35,850.16 వద్ద స్థిరపడింది. గత శుక్రవారం సెనె్సక్స్ 181 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. కాగా 50 షేర్ల సూచీ నిఫ్టీ సైతం 44.45 పాయింట్లు ఆధిక్యంతో 0.41 శాతం లాభపడి 10,771.80 వద్ద ముగిసింది. ఒక దశలో 10,835.95 పాయింట్లకు ఎగబాకిన నిఫ్టీ కొంత దిదుబాటుకు గురైంది.
ఈక్రమంలో రియాల్టీ, సాంకేతిక, ఐటీ, విద్యుత్, వినిమయ వస్తువులు, బ్యాంకింగ్, చమురు, గ్యాస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అలాగే అమెరికా, చైనాలు తమ ధరల యుద్ధ సమస్యను ఉభయ తారకంగా పరిష్కరించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ సోమ, మంగళవారాల్లో చర్చలు జరిపేందుకు నిర్ణయించడం మార్కెట్లకు ఊతం ఇచ్చింది. ఈనేపథ్యంలోనే చమురు ధరలు సైతం సరఫరాకు సంబంధించి కొంత లాభాలను చవిచూశాయి. దేశీయంగా ద్రవ్యలభ్యతను సరళతరం చేసేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడం, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను పంచవచ్చన్న అంచనాలు మార్కెట్‌కు సానుకూలంగా మారాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తెలిపారు. కాగా మన దేశంలోని టాప్ సాఫ్ట్‌వేర్ సేవా రంగ ఎగుమతిదారులు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఈనెల 10,11 తేదీల్లో తమ త్రైమాసిక ఫలితాల నివేదికలను విడుదల చేయనున్నాయి. అలాగే చైనా సెంట్రల్ బ్యాంకు శుక్రవార విధాన నిర్ణయం (ఫ్రైడే పాలసీ)లో సౌలభ్యాన్ని ప్రకటించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఈ బ్యాంకు నిల్వల్లో 100 బేసిస్ పాయింట్లు తగ్గించుకునేందుకు అంగీకరించింది.
లాభాల్లో అగ్రగామి యాక్సిస్ బ్యాంకు
సోమవారం సెనె్సక్స్‌లో లాభపడిన సంస్థల్లో ప్రైవేటు బ్యాంకు యాక్సిస్ బ్యాంకు 2.84 లాభాలతో అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో 2.64 శాతంతో టాటా మోటార్స్ నిలిచింది. అలాగే ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఆసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండియా లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, హింద్ యునీలీవర్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్ బ్యాంకులు సైతం 1.57 శాతం లాభాలను కూడగట్టాయి.
నష్టాల్లో బజాజ్ ఆటో, యెస్ బ్యాంకు
సోమవారం మార్కెట్లో నష్టాలు చవిచూసిన సంస్థల్లో బజాజ్ ఆటో, యెస్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, సన్ పార్మా, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ ఉన్నాయి. ఈ కంపెనీలు 2.82 శాతం నష్టాలను చవిచూశాయి. కాగా గృహ నిర్మాణం రంగం 1.55 శాతం లాభాలను, సాంకేతిక రంగం 1.16 శాతం, ఐటీ రంగం 1.11 శాతం, వినిమయ వస్తువుల రంగం 1.06 శాతం, విద్యుత్ రంగం 1.03 శాతం, బ్యాంకింగ్ రంగం 0.37 వాతం, ఎప్‌ఎమ్‌సీజీ 0.25 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగం 0.18 శాతం వంతున లాభపడ్డాయి. ఐతే ఆరోగ్య, లోహ, ఆటోమొబైల్ రంగాలు నష్టాల బాటలో నడిచాయి.