బిజినెస్

జీడీపీ వృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: వ్యవసాయ ఉత్పాదక రంగాలు గణనీయమైన ప్రగతిని సాధించిన నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ, తయారీ రంగాలు అద్భుతమైన పురోగతిని సాధించాయని, వీటి ప్రభావం ఫలితంగానే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటు 7.2 శాతానికి పెరిగే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం తెలిపింది. 2017-18 సంవత్సరంలో 6.7 శాతం ఉన్న జీడీపీ వృద్ధిరేటు కొత్త ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతానికి పెరిగే అవకాశాలు గణనీయంగా కన్పిస్తున్నాయని తెలిపింది. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం దేశంలో వృద్ధిరేటు క్రమానుగతంగా పెరుగుతోందని కేంద్ర గణాంకాల కార్యాలయం తన నివేదికలో స్పష్టం చేసింది.