బిజినెస్

బంధన్ బ్యాంకు నికర లాభం రూ.331 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: ప్రైవేటురంగంలోని బంధన్ బ్యాంకు గురువారం త్రైమాసిక వ్యాపార గణాంకాలను వెల్లడించింది. గడచిన డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ బ్యాంకు రూ.331.25 కోట్ల లాభాలను గడించింది. అంతకు క్రితం సంవత్సరం ఇదే కాలానికి బేరీజు వేసుకుంటే ఈ లాభాలు 10.3 శాతం అధికం. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బ్యాంకు మొత్తం ఆదాయం 1,883.85 కోట్ల రూపాయలు పెరిగింది. అంతకు క్రితం యేడాది 1,336 కోట్ల రూపాయలు ఈ బ్యాంకు గడించింది. అలాగే రుణాలకు సంబంధించి నిరర్ధక ఆస్తులు (ఎన్‌ఫీఏ) విలువ మొత్తం కూడా 2.41 శాతం పెరిగింది. గత యేడాది ఈ విలువ 1.67 శాతం పెరిగింది. మొత్తానికి బ్యాంకు నిరర్థక ఆస్తులు గడచిన యేడాది 0.80 శాతానికి తగ్గాయి. కాగా వడ్డీల రూపేణా వచ్చే ఆదాయం సైతం ఈ బ్యాంకుకు 53.5 శాతం పెరిగింది. ఈరూపేణా అంతకు క్రితం సంవత్సరం ఈ త్రైమాసికంలో రూ.732 కోట్ల ఆదాయం రాగా, గడచిన యేడాది ఈ ఆదాయం 1,124 కోట్ల రూపాయలకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఐ) సైతం గడచిన త్రైమాసికానికి 70.3 శాతంగా ఉంది. గడచిన యేడాది 9.9 శాతం మాత్రమే నమోదైంది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ ప్రమోట్ చేస్తున్న హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ‘గృహ్ ఫైనాన్స్ లిమిటెడ్’ నిర్వహణను తీసుకునేందుకు గత వారం బంధన్ బ్యాంకు అంగీకరించిన సంగతి తెలిసిందే.