బిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: కార్పొరేట్ బ్యాంకులతో సమానమైన ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాం కులను క్రమక్రమంగా ప్రభుత్వ వాటాలను (ఈక్విటీలను) 52 శాతానికి తగ్గించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో సహజంగానే ప్రభుత్వ వాటాలు అధికంగా ఉంటాయి. ఐతే కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ప్రభు త్వ వాటాలు తగ్గించాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యూహం. ఈక్రమంలో తొలివిడతగా 52 శాతానికి ఈ వాటాలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ స్థితిగతులు సానుకూలంగా మారిన వెంటనే ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ఆదేశాలను అమలులోకి తెస్తాయని, ఇందుకు సంబందించి అన్ని అనుమతులూ వారికి ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవడం ద్వారా మరో 25 శాతం ప్రజల వాటా లు సంతరించుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్యూఐపీ) ద్వారా 20వేల కోట్ల రూపాయల విలువైన షేర్ల అమ్మకాలకు ముందుకు వచ్చింది. తొలుత ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలని నిర్ణయం జరిగింది. గత నెలలో బ్యాంకుకు చెందిన వాటాదార్లు వ్యాపార విస్తరణలో భాగంగా చేపట్టిన షేర్ల అమ్మకాలకు అంగీకారం తెలిపారు. పలు ఇతర బ్యాంకులు సైతం ఈ విధానాన్ని అనుసరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.