బిజినెస్

ప్రైవేటు ఈక్విటీలు, వెంచర్ మూలధనంపై 35 శాతం పెరిగిన పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 14: ప్రైవేటు ఈక్విటీలు (పీఈ), వెంచర్ మూలధనం (వీసీ)పై 2018లో పెట్టుబడులు పెరిగాయి. దేశం మొత్తం మీద ఈ పెట్టుబడులు సుమారు 35 శాతం అంటే 35.1 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. 2017 లో పెరిగిన 26.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులకంటే ఇది అథికం. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల కారణంగా ఈ పెట్టుబడులు గతేడాది పెరిగాయని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. పీఈ, వీసీల నుంచి వెనక్కు మళ్లిన పెట్టుబడుల విలు వ (ఎగ్జిట్ వాల్యూ) మొత్తం 26 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది గడచిన మూడేళ్ల కంబైన్డ్ ఎగ్జిట్ వాల్యూస్‌కు స మానం. కాగా 2018వ సంవత్సరం పీఈ, వీసీల్లో పెట్టుబడులకు, అదే క్రమంలో పెట్టుబడులు వెనక్కు తీసుకోవడంలో నూ మంచి ఫలితాలిచ్చిన సంవత్సరంగా మిగిలింది. ముందే అంచనా వేసిన విధంగా ఇవి ఈయేడాది అత్యధికంగా రికా ర్డు స్థాయిలోనే జరిగాయి. యేడాది ద్వితీయార్థంలో పెట్టుబడులు చాలావరకు వెనక్కు వెళ్లినప్పటికీ అవసరానికి మించి తర్వాత ఇనె్వస్టర్లు మదుపుచేశారని ప్రైవేటు ఈక్విటీ సర్వీసెస్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు విశే్లషించారు. 2018లోప్రధానమైన 500 మిలియన్ డాలర్ల విలువైన 12 వాణిజ్య ఒప్పందాలు జరిగాయని, మరో ఎనిమిది ఒక బిలియన్ డాలర్ల వి లువైన ఒప్పందాలు జరిగాయన్నారు. సంవత్సరం మొత్తం మీద 761 ఒప్పందాలు జరిగి అంతకు క్రితం యేడాదికంటే 28 శాతం పెరిగాయని ఆయన వివరించారు. ప్రత్యేకించి స్టార్టప్‌ల్లో కొలుగోళ్లు, పెట్టుబడులతో ఈ వాణిజ్య ఒప్పందాల్లోనూ పెరుగుదల నమోదైందంటున్నారు. సాఫ్ట్‌బ్యాంకు మూలధన వెంచర్ పెట్టుబడుల వంటి మెగా ఒప్పందాలు సైతం ఈ సందర్భంగా జరిగాయి. టెనె్సంట్ అండ్ నాస్పర్స్ సంస్థ పెద్దమొత్తంలో పెట్టుబడులు మదుపుచేసింది.