బిజినెస్

మైండ్‌విజన్ కేపిటల్ మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: వాటాల విషయంలో మైండ్‌విజయన్ కేపిటల్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడిందని భారత స్టాక్ మార్కెట్‌ను నియంత్రీకరించే సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకటించింది. పది ఖాతాలను ప్రత్యేకంగా తప్పుపడుతూ 34 లక్షల రూపాయల జరిమానా విధించింది. సెబీ సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్కెట్‌లో లేని డిమాండ్‌ను సృష్టించేందుకు మైండ్‌విజన్ కేపిటల్ కంపెనీ పాల్పడింది. ఎక్కువ లావాదేవీలు జరిపిన పది ఖాతాలను పరిశీలిస్తే, ఇవన్నీ ఒకరితో ఒకరికి సంబంధం ఉన్నవేనని స్పష్టమైంది. మైండ్‌విజన్ కేపిటల్ కంపెనీ షేర్ మార్కెట్‌లో కృత్రిమ డిమాండ్‌కు పాల్పడుతున్నదని అందిన ఫిర్యాదుపై సెబీ విచారణ జరపడంతో ఈ విషయం బయటపడింది. పది ఖాతాల్లోనే పరస్పర అమ్మకాలు, కొనుగోళ్లను సెబీ గుర్తించింది. మార్కెట్‌లో వాటాలకు డిమాండ్‌ను సృష్టించడానికి ఈ లావాదేవీలు జరిపారని తేటతెల్లపైంది. ఈ పది ఖాతాల్లో 94,745 వాటాలు ట్రేడైనట్టు నమోదైంది. నిజానికి మార్కెట్‌లో ఉన్న షేర్ల కంటే ఇది 12.5 శాతం అధికం. ఒక వ్యూహం ప్రకారం వాటాల అమ్మకాలను మార్కెట్‌లో చూపించడం ద్వారా కృత్రిక డిమాండ్‌ను సృష్టించడానికి ప్రయత్నం జరిగిందని సెబీ నిర్ధారించింది. 2009-2010 సంవత్సరాల మధ్య జరిగిన వాటాల అమ్మకాలు లేదా కొనుగోళ్లు ఈ పది ఖాతాల మధ్యలో ఉండడం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ట్రేడింగ్ అని స్పష్టమవుతున్నదని సెబీ ప్రకటించింది. లేని డిమాండ్‌ను మార్కెట్‌లో చూపేందుకు ప్రయత్నించిన కారణంగా మైండ్‌విజన్ కేపిటల్ సంస్థకు జరిమానా విధించినట్టు వివరించింది. స్టాక్ మార్కెట్‌లో ఇలాంటి అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేసింది.