బిజినెస్

పతనంతో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం మొదటి రోజు లావాదేవీలు పతనంతో ముగిశాయి. గత వారం చివరిలో నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్ సోమవారం కూడా కోలుకోలేదు. 30 షేర్ ఇండెక్స్ 156.28 పాయింట్లు (0.43 శాతం) కోల్పోయి 35,853.56 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 57.35 పాయింట్లు (0.53 శాతం) పతనమై, 10,537.60 పాయింట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఫలితంగా ఆసియా మార్కెట్ల క్షీణత బీఎస్‌ఈలో ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈవారం సెనెక్స్ పుంజుకుంటుందని, పండగ వాతావరణం మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని స్టాక్ బ్రోకర్లు వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపు చివరి వరకూ స్టాక్స్ అమ్మకాలవైపే మదుపరులు ఆసక్తిని ప్రదర్శించారు. ప్రతికూల వాతావరణంలో సాగిన లావాదేవీల్లో లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) 2.64 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ బ్యాంక్ 2.07 శాతం నష్టపోయాయి.
అదే విధంగా వేదాంత (1.78 శాతం), ఎన్‌టీపీసీ (1.56 శాతం), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్/ 1.50 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.36 శాతం), యాక్సిస్ బ్యాంక్ (1.33 శాతం), హీరో మోటార్ (1.22 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.21 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.01 శాతం) కూడా నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. అయితే, ఎస్ బ్యాంక్ వాటాల ర్యాలీ కొనసాగడంతో, 6.22 శాతం పెరుగుల సాధ్యమైంది. మేనేజింగ్ డైరెక్టర్/ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా సేవలు అందిస్తున్న రాణా కపూర్ స్థానంలో ఈ రంగంలో అపారమైన అనుభవం ఉన్న రజత్ మోంగా నియామకం దాదాపు ఖరారైందన్న వార్త ఎస్ బ్యాంక్ స్టాక్స్‌కు డిమాండ్‌ను పెంచాయి. లాభపడిన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్ తదితర కంపెనీల వాటాలు సగటున 1.68 శాతం లాభాలను నమోదు చేశాయి. భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగడానికి అంతర్జాతీయ మార్కెట్లు బలహీన పడడం ఒక కారణమైతే, కేంద్ర ప్రభుత్వం నవంబర్ మాస పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు పడిపోయిందని ప్రకటించడం మరో కారణం. గత 17 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక ఉత్పత్తి రేటు 0.5 శాతం పడిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వినియోగ వస్తువులు, మూలధన వస్తువుల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వివరించింది. ఈ నివేదిక మదుపరులను కొత్త వాటాల కొనుగోళ్లకు దూరంగా ఉంచింది. ఎక్కువ మంది తమ వద్ద ఉన్న వాటాలను అమ్మడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో, సెనె్సక్స్ నష్టపోయింది. దేశీయ పెట్టుబడిదారులు కొంత వరకు ఆదుకోవడంతో, భారీ నష్టం తప్పిందనే చెప్పాలి. విదేశీ పెట్టుబడిదారులు 687.20 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ మదుపరులు 123.17 కోట్ల రూపాయల విలవైన వాటాలను కొనుగోలు చేశారు. ఇలావుంటే, రూపాయి విలువ 32 పైసలు పడిపోయింది. ఫలితంగా డాలర్ విలువ 70.81 రూపాయలకు చేరింది.