బిజినెస్

వరుసగా మూడో రోజూ పసిడి ధరల పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: పండుగ సీజన్‌లో పసిడి ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడోరోజూ ధర పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.33,190కి చేరింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం తులం బంగారం (10 గ్రాములు)పై 65 రూపాయలు పెరిగింది. దేశీయ జువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతోనే ఇలా మూడు రోజులుగా బంగారం ధర పెరగుతూ వచ్చిందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో వెండి ధరలు సైతం కిలోపై 300 రూపాయలు పెరిగి రూ.40,500కి చేరింది. పారిశ్రామిక విభాగాలు, నాణేల మార్కెట్ల నుంచి డిమాండ్ పెరిగినందువల్లే వెండి ధర పెరిగిందని అంచనా. కాగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై మదుపుచేయడమే సురక్షితమైన చర్యగా ఇనె్వస్టర్లు భావించారని, పైగా అంతర్జాతీయంగా సైతం బంగారానికి సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని విశే్లషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తులంపై 250 వరకు పెరిగాయి. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో ఔన్సు బంగారం 1,292.03 డాలర్లు అధికంగా అమ్ముడవగా, వెండి ఔన్సు ధర 15.60 డాలర్లు పలికింది. ఇలావుండగా మన దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం 65 రూపాయలు పెరిగి రూ.33,190, 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం రూ.33,040గాను అమ్ముడైంది. అలాగే సవరం (ఎనిమిది గ్రాముల) బంగారం ధర లు మాత్రం స్థిరంగా 25,400 రూపాయల వద్ద నిలిచాయి. అయితే వారం వారం సరఫరాకు సంబంధించిన వెండి మాత్రం కిలోపై రూ.88 ధర తగ్గి 39,833 వద్ద ట్రేడైంది. ఇక వెండి నాణేలు హెచ్చుతగ్గులు లేకుండా 100 పీసులు కొనుగోలుకు రూ.77 వేలు, అమ్మకానికి రూ.78 వేలు వంతున ధర పలికింది.