బిజినెస్

బంగారం మెరిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: జాతీయ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారానికి డిమాండ్ పెరిగింది. పది గ్రాముల ధర 33,190 రూపాయలుగా మొదలైన మార్కెట్‌లో దేశీయ జ్యువెలరీ వర్తకులు, వ్యక్తుల కొనుగోళ్లు పెరిగాయి. దీనితో 110 రూపాయలు పెరిగిన పది గ్రాముల పసిడి ధర 33,300 రూపాయలకు చేరింది. అయితే, వెండి మాత్రం నష్టాలను ఎదుర్కొంది. కిలో వెండి ఏకంగా 300 రూపాయలు తగ్గడంతో, 40,200 రూపాయలకు పడిపోయింది. బుధవారం మార్కెట్ అనుకూలంగా ఉండడంతో 40,500 రూపాయలకు చేరుకున్న కిలో వెండి ధర ఈవారాంతం వరకూ అదే ధోరణిలో కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అందుకు భిన్నంగా వెండి రేటు పతనమైంది.
బంగారం వరుసగా నాలుగో రోజు కూడా లాభాలను ఆర్జించడం విశేషం. దేశీయ జ్యువెలరీ తయారీదారులు కొనుగోళ్ల పట్ల మొగ్గు చూపడంతో పసిడి ధర పెరిగిందని, ఈ వారం చివరి వరకూ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అఖిల భారత సరఫా సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా ఉండడం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణమని పేర్కొంది.