బిజినెస్

మరింతగా కరెన్సీ ఆవశ్యకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 18: దేశ స్థూలోత్పత్తి (జీడీపీ) పరిమాణం పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక రంగంలో మరింతగా కరెన్సీ ఆవశ్యకత ఏర్పడుతోందని రిజర్వు బ్యాంకుకు చెందిన అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో జరిగిన డీమోనిటరైజేషన్ సమయంలో 500, 1000 కరెన్సీ నోట్లను ప్రభుత్వం రద్దు చేసినపుడు పెద్దయెత్తున కరెన్సీ లోటు ఏర్పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జీడీపీ) పెరుగుతున్న క్రమంలో ఆర్థిక రంగంలోకి మరింతగా కరెన్సీ రావాల్సిన అవసరం ఏర్పడిందని ఇక్కడ జరిగిన ఓ ముఖాముఖి సందర్భంగా ఆ అధికారి వెల్లడించారు. డీ మానిటరైజేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల కరెన్సీని కొత్తగా తీసుకువచ్చినప్పటికీ రూ.1000 కరెన్సీని మాత్రం తీసుకురాలేదు. ఐతే 2000 రూపాయల కరెన్సీ నోట్‌ను మాత్రం ఆర్‌బీఐ తీసుకువచ్చింది. కాగా కౌంటర్‌ఫీయట్ నోట్ల కొరత ప్రస్తుతం ఉందని, ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ నోట్లు సరైన ప్రమాణాల్లో లేవని ఆ అధికారి వివరించారు. మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) విషయానికి వస్తే వీటి డిపాజిట్ల సమీకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అంబూడ్స్‌మెన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్‌బీఐకి చెందిన మరో అధికారి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి డిజిటల్ అంబూడ్స్‌మెన్ అమలులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక మంజూర్ల విషయంలో ఆర్బీఐ జాతీయ స్థాయి వ్యూహాన్ని అనుసరిస్తోందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ)లకు అడ్డగోలు నిబంధనలు లేకుండా రుణ సదుపాయం పొందేలా చూసేందుకు ఆర్బీఐ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని ఆ అధికారి పునరుద్ఘాటించారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో ఆర్బీఐ సమన్వయంతో వ్యవహరిస్తూ వినియోగదారులకు సహకరిస్తున్నట్టు చెప్పారు.