బిజినెస్

నామమాత్రపు లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 18: భారత స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలకు ఈవారం చివరి రోజైన శుక్రవారం కూడా అనిశ్చితి కొనసాగింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి నామమాత్రపు లాభంతో బయటపడింది. మొదటి నుంచి మదుపరులు అనాసక్తిని ప్రదర్శించడం, అంతర్జాతీయ సూచీల్లో సానుకూల ధోరణులు లేకపోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అటు అమ్మకాలు ఒత్తిళ్లుగానీ, ఇటు కొనుగోళ్ల హోరుగానీ పెద్దగా లేకపోవడంతో, ఒడిదుడుకుల ప్రయాణం కొనసాగించిన ట్రేడింగ్ చివరికి 12,53 పాయింట్లు (0.03 శాతం) పెరిగి, 36,386.61 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.75 పాయింట్లు (0.02 శాతం) పెరిగి, 10,906.95 పాయింట్లుగా నమోదైంది. కాగా, ఈవారం మొత్తంలో జరిగిన లావాదేవీలను గమనిస్తే, సెనె్సక్స్ లాభాలను ఆర్జించిందికానీ, అవి నామాత్రంగానే ఉండడం గమనార్హ. మొత్తంగా చూస్తే, ఈవారం సెనె్సక్స్ 378.77 పాయింట్లు లాభపడింది.
తగ్గిన బంగారం ధర
న్యూఢిల్లీ, జనవరి 18: బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగు రోజులు లాభాల బాటలో పరుగులు తీసిన బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయిలు పతనం కావడంతో 33,220 రూపాయలుగా ముగిసింది. ఆభరణాల అమ్మకం దారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో, బులియన్ మార్కెట్‌కు నష్టం తప్పలేదు. అయితే, పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ పెరగడంతో, కిలో వెండి ధర 180 రూపాయలు పెరిగి, 40,380 రూపాయలకు చేరింది.