బిజినెస్

ఎన్‌జీటీ మరింత కఠినం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: పర్యావరణానికి హాని కలిగించే కంపెనీలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) కొరడా ఝళిపిస్తున్నది. అందుకు నిదర్శనంగా ఇటీవలే జర్మనీ కార్ల కంపెనీ వోక్స్‌వ్యాగన్‌కు పరిహారం కోరుతూ ఆదేశాలు జారీ చేయడాన్ని పేర్కోవాలి. వోక్స్‌వాగన్ తయారు చేస్తున్న డీజిల్ కార్లు పర్యావరణానికి హాని కల్గిస్తున్నాయని ఎన్‌జీటీ మండిపడింది. 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో జైలు పంపుతామని ట్రిబ్యునల్ హెచ్చరించింది. వోక్స్‌వ్యాగన్ డీజిల్ కార్ల వల్ల కార్బర్ ఉద్గారాలు వెలువడుతున్నాయని, తద్వారా పర్యావరణానికి హాని జరుగుతుందని 2018 నవంబర్ 16 ఎన్‌జీటీ తేల్చింది. దీనిపై హెచ్చరించినా కంపెనీ స్పందించకపోవడంపై తీవ్రంగా స్పందించింది. ‘తక్షణం 100 కోట్లరూపాయలు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు డిపాజిట్ చేయండి. ఇది కూడా తాత్కాలికమే’ అని ట్రిబ్యునల్ ఆదేశించింది. తరువాత పరిస్థితిని ఉన్నత స్థాయి కమిటీ సమీక్షిస్తుందని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఆటోమోటీవ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రిసెర్చీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో పరిస్థితి సమీక్షించేందుకు ఓ సంయుక్త కమిటీ ఏర్పాటైంది. ఆరోగ్యానికి చేటు తెస్తున్న వోక్స్‌వ్యాగన్ కంపెనీకి 171.34 కోట్ల రూపాయల జరిమానా విధించాలని నాలుగు సంస్థలతో కూడిన కమిటీ సిఫార్సు చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడానికి ఈ డీజిల్ వాహనాలు కారణమవుతున్నాయని కమిటీ పేర్కొంది. ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ఎన్‌జీటీ బెంచ్ గురువారం ఈ అంశంపై తీవ్రంగానే స్పందించింది. ‘శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు రూ. 100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే. మా ఆదేశాలను పాటించాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవ్’అని జస్టిస్ ఎస్ వంగ్డీ నాయకత్వంలోని ధర్మాసం ఆదేశించింది. డిపాజిట్ చెల్లించకపోతే కంపెనీ డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎన్‌జీటీ తీవ్ర హెచ్చరిక చేసింది. అయితే ప్రమాణాలకు అనుగుణంగానే కార్లను తయారు చేస్తున్నామని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. పైగా ఈ అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని వెల్లడించారు. పిటిషనర్ తరుఫున న్యాయవాది సంజీవ్ ఐలావాడీ తన వాదనలు వినిపించారు. సంయుక్త కమిటీ ఎలాంటి అధ్యయనం జరపకుండా ఓ నిర్ణయానికి వచ్చేసిందని ఆరోపించారు. వోక్స్‌వాగన్ పరిహారాన్ని కడుతుందా లేదా అనే విషయాన్ని పక్కకు ఉంచితే ఎన్‌జీటీ భవిష్యత్తులో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది ఈ పరిణామం స్పష్టం చేస్తున్నది.