బిజినెస్

బాండ్ల ద్వారా రూ.8,800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సుమారు 8,800 కోట్ల రూపాయలు (1.25 బిలియన్ డాలర్లు) అంతర్జాతీయ మార్కెట్ నుంచి బాండ్లద్వారా సేకరించనుంది. ఈమొత్తాన్ని బ్యాంకు వాణిజ్య విస్తరణకు వినియోగించడం జరుగుతుందని ఆ బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఐదేళ్లలో నిర్ధారిత రేట్లతోకూడిన సీనియర్ అన్ సెక్యూర్డ్ బాండ్లను రెండు ట్రాంచెస్‌లో జారీచేసి 850 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. సెమీ వార్షిక చెల్లింపులు చేసేలా కూపన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే మూడేళ్ల కాలవ్యవధికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఉన్నాయని ఎస్‌బీఐ అధికారులు వివరించారు. లండన్‌లోని తమ బ్యాంకు కార్యాలయం ద్వారా ఈ బాండ్ల జారీ జరుగుతుందని, సింగపూర్, భారత్ స్టాక్ ఎక్చేంజ్ జాబితాలో చేరుతుందని మార్కెట్ రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో బ్యాంకు అధికారులు వివరించారు.