బిజినెస్

భారీ నష్టాల నుంచి తప్పించుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 19: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ వారం రికార్డు స్థాయిలో లాభాలు నమోదు కాకపోయినప్పటికీ, భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, వరుసగా నాలుగు రోజుల పాటు స్వల్ప లాభాలను ఆర్జించి, నిలదొక్కుకుంది. 36,000 పాయింట్ల మైలురాయిని ఈవారం మరోసారి అధిగమించింది. అదే విధంగా నిఫ్టీ 10,900 పాయింట్లకు తగ్గకుండా లావాదేవీలను సాగించింది. స్థూలంగా చూస్తే, ఈవారం స్టాక్ మార్కెట్ కొంత వరకూ సానుకూల ధోరణులను ప్రదర్శించిందనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేటాయించిన నిధులను విడుదల చేయడానికి అక్కడి చట్టసభ నిరాకరించడంతో తలెత్తిన సంక్షోభం అన్ని దేశాలపై ప్రభావం చూపింది. అమెరికా ‘షోడౌన్’తో ప్రపంచ దేశాల మార్కెట్లలో ట్రేడింగ్ దారుణంగా దెబ్బతిన్నది. అయితే, మన దేశంలో, స్థానికంగా ఉండే మదుపరులు వాటాల కొనుగోళ్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించడంతో భారీ నష్టాలకు గురికాకుండా నిలదొక్కుకుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ట్రేడింగ్‌లో చిన్నతరహా కంపెనీలు బాగా నష్టపోయాయి. వాటి వాటాల్లో సగటున 0.6 శాతం పతనం నమోదైంది. మధ్యతరహా కంపెనీలకు చెందిన వాటాల సూచీల పతనం సుమారు ఒక శాతం వరకూ ఉంది. భారీ కంపెనీలు మాత్రం భారీ లాభాలను ఆర్జించగలిగాయి. డిసెంబర్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంగా 10,000 కోట్లకుపైగా లాభాలు ఆర్జించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) ఫలితాలు స్పష్టం చేశాయి. దీనితో ఆ కంపెనీ వాటాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరోవైపు ఇన్ఫోసిస్ 8,260 కోట్ల రూపాయల విలువైన కంపెనీ ఈక్విటీ వాటాలను తిరిగి కొంటున్నట్టు ప్రకటించిన మరుక్షణం నుంచే, స్టాక్ మార్కెట్ తీరు మారింది. 10.32 ఈక్విటీ షేర్లను ఇన్ఫోసిస్ తిరిగి కొనడాన్ని ప్రారంభించడంతో, మిగతా కంపెనీల ట్రేడింగ్ పడిపోయింది. స్టాక్ బ్రోకర్లు సైతం ఇన్ఫోసిస్ వాటాలపై దృష్టి పెట్టడం కూడా ఈవారం మార్కెట్ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి కారణమైంది. దేశీయ మదుపరుల నుంచి సానుకూల స్పందన లేకపోతే, స్టాక్ మార్కెట్ కుప్పకూలి ఉండేదని నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి కూడా అదే విధంగా కనిపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గినప్పటికీ, దేశీయంగా మదుపరులు షేర్ల కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపారు.
స్థూలంగా చూస్తే మాత్రం స్టాక్ మార్కెట్‌లో బుల్న్ కొనసాగాల్సి ఉన్నప్పటికీ, బడా కంపెనీలు ప్రకటిస్తున్న లేదా ప్రకటించబోయే మూడో త్రైమాసిక ఫలితాల కారణంగా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగక కుంటుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర, రూపాయి మారకపు విలువ వంటి అంశాలు కూడా భారత స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. అయితే, స్థూలంగా చెప్పాలంటే ఈ వారం సెనె్సక్స్ భారీ నష్టాలను ఎదుర్కోలేదు. పైగా మూడు వందలకు మించి పాయింట్లు లాభపడింది.
అదే మాదిరి నిఫ్టీ కూడా నష్టాల బారిన పడకుండా, స్వల్ప లాభాలను ఆర్జించగలిగింది. రాబోయే కాలంలో స్టాక్ మార్కెట్ బలపడుతుందని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.