బిజినెస్

ఇద్దరు పీఎన్‌బీ ఈడీలపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకొని, ఆతర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారస్థుడు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి తలనొప్పి వ్యవహారంగా మారింది. బ్యాంకులో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ధోరణులను అరికట్టలేకపోయారన్న ఆరోపణలను బ్యాంకుకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌ను వారివారి పదవుల నుంచి తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 18 నుంచే వారి పేర్లను లిస్ట్ నుంచి తొలగించినట్టు వివరించింది. సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ ఫైనాన్షిల్ టెలికమ్యూనికేషన్ (స్విఫ్ట్)తో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్)ను అనుసంధానం చేయమని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, దానిని వీరిద్దరూ నిర్లక్ష్యం చేశారని పేర్కొంది. 2016లో ఆర్‌బీఐ 2016లో సర్క్యులర్‌ను జారీ చేసిన విషయాన్ని కేంద్రం తన ప్రకటనలో ప్రస్తావించింది. కాగా, వేటు పడిన ఇద్దరు ఈడీల్లో బ్రహ్మాజీ రావు ఈనెలలోనే రిటైర్ కానున్నాడు. సంజీవ్ శరణ్ సర్వీసు మే వరకూ ఉంది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసులో అలహాబాద్ బ్యాంక్ అధికారిణి ఉషా అనంతసుబ్రహ్మణియన్‌ను కేంద్రం ఇది వరకే సస్పెండ్ చేసింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపిస్తున్నది. ఈ క్రమంలోనే పీఎన్‌బీకి చెందిన ఇద్దరిపై వేటు వేసింది.