బిజినెస్

విజయవాడలో లలితా జ్యూయలరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): లలితా జ్యూయలరీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం పొందిన సంస్థగా మంచిపేరు పొందడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో లలితా జ్యూయలరీ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసియాలోనే పెద్దదైన భారీ షోరూమ్‌ను సోమవారం యనమల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ కష్టానే్న నమ్ముకొని కొనుగోలుదారుల్లో మంచిపేరు సంపాదించిన వ్యక్తిగా సంస్థ అధిపతి కిరణ్‌కుమార్ ఇతర వ్యాపారులకు ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు. రాజధాని కేంద్రం అమరావతిలో ఇలాంటి భారీ వ్యాపార సంస్థలు రావటం శుభ పరిణామమన్నారు. ఇలాంటి సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. లలితా జ్యూయలరీ సంస్థ సీఎండీ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలు కష్టపడి సంపాదించే ధనం నష్టపోకూడదనేది తన దృక్పథమని తెలిపారు. తమ సంస్థలో నాణ్యత కలిగిన వజ్రాలు, బంగారం, వెండి, తదితర నగలను అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్ర ప్రజల నమ్మకం పెంపొందించుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశారు. షోరూమ్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు పాల్గొన్నారు.

చిత్రం.. విజయవాడలో లలితా జ్యూయలరీ షోరూమ్ ప్రారంభిస్తున్న మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు