బిజినెస్

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు కొనసాగుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 23: అమెరికా-చైనాల మథ్య వాణిజ్యపరమైన శిఖరాగ్ర చర్చలు కొనసాగుతాయని బుధవారం నాడు వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ చర్చలు రద్దయ్యాయన్న వార్తలను అమెరికా ఖండించింది.
ఈ చర్చలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చింది. చైనా వైస్ ప్రీమియర్ లియూ హీ వచ్చే వారం వాషింగ్టన్‌కు వచ్చి యూఎస్ వైస్ ప్రీమియర్‌తో చర్చలు జరుపుతారని వైట్‌హౌస్ తెలిపింది. వచ్చే మార్చి 1 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన అంశాల్లో వైరుధ్యాలు సమసిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చర్చలకు నిర్దేశించిన కాలవ్యవధిలో మరో 90 రోజులు మిగిలివున్నాయని తెలిపింది. చైనా వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాలను పెంచడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన విభేదాలు ఆజ్యం పోసుకున్న సంగతి తెలిసిందే. ఎత్తుకు పైఎత్తు చందంగా ఇరు దేశాలు గత సంవత్సరం సుమారు 360 బిలియన్ డాలర్ల సుంకాలను బాదాయి. చైనా వాణిజ్య వ్యవహారాలు నిజాయితీగా లేవన్న విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో తొలుత అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. దీంతో యూరోపియన్ యూనియన్ దేశాలతోబాటు, జపాన్ తదితర దేశాలూ అదే పంథాను అనుసరించాయి. ఈక్రమంలో చైనా వైస్‌ప్రీమియర్ లీయూతో వచ్చే వారం అమెరికా జరుపనున్న ప్రాథమిక చర్చలు రద్దయ్యాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్, సీఎన్‌బీసీ వంటి కొన్ని వార్తా సంస్థలు మంగళవారం నాడు పేర్కొన్నాయి. ఈ వాణిజ్య వ్యవహారాల్లో అతిక్లిష్టమైన అంశాలపై అమెరికా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రత్యేకించి బలవంతపు సాంకేతిక విజ్ఞానం బదిలీ, చైనా ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసేలా సంస్కరణలు చేపట్టడం వంటి విషయాలపై నిర్లిప్త వైఖరి అవలంభించారని ఆ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల స్థితిగతుల దృష్ట్యా అమెరికా స్టాక్ మార్కెట్లు దిగువస్థాయి నుంచే ఆరంభమయ్యాయి. తాజా వార్తలు కూడా ఆ మార్కెట్లను ప్రభావితం చేసే పరిస్థితులు తలెత్తడంతో అమెరికాలోట్రేడింగ్ ముగింపునకు వచ్చిన సమయంలో వైట్ హౌస్ ఆర్థిక సహాయకుడు లారీ కుడ్లోవ్ స్పందించారు. అంతేగాక ‘ప్రణాళికాబద్ధంగా నిర్ణయమైన ఇరు దేశాల సమావేశం ఏదీ రద్దు కాలేద’ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హుఆ చునైంగ్ సైతం బుధవారం బీజింగ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. వాణిజ్య అంశాల చర్చల విషయంలో ఇరు దేశాలు అందుబాటులోనే ఉన్నాయని, తనకు తెలిసినంతవరకు ఎలాంటి సమావేశమూ రద్దు కాలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా స్టాక్ మార్కెట్లు కొంతవరకు కోలుకున్నాయి. అయినా కొంత వరకు దిగువ స్థాయిలోనే ముగిశాయి. మరోలైపుబుధవారం ఆసియన్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలనే చవిచూశాయి. కాగా వైజ్ఞానిక బదిలీ, మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై చైనాపై అమెరికా వత్తిడి కొనసాగుతుందని వైట్‌హౌస్ ఆర్థిక సహాయకుడు కుడ్లోవ్ స్పష్టం చేశారు. ప్రతి ఒప్పందంపై ఆ తదుపరి చైనా ఫిర్యాదు చేయడానికి వీలులేదని కూడ అమెరికా అధికారులు నొక్కిచెబుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ చర్చలు ఫలప్రదం కావాలంటే నిర్ధిష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ అవసరమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.