బిజినెస్

వినియోగదారుడే దేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: ‘వినియోగదారుడే తొలుత’ అనే విధానంతో తమ కంపెనీ ముందుకెళుతోందని, ఇది వ్యాపార విస్తరణలో చాలా ఉపయుక్తంగా ఉందని ‘బజాజ్ ఫిన్‌సర్వ్’ చీఫ్ సంజీవ్ బజాజ్ బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వినియోగదారుడి అవసరానికి అనుగుణంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇండియా 4.0’ అందరికీ అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై డబ్ల్యుఈఎఫ్ వార్షిక సదస్సులో భాగంగా జరిగిన ప్రత్యేక సెషన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ కంపెనీ వినియోగదారులకు అప్పటికప్పుడే రుణ సౌకర్యం సైతం అందజేస్తోందని ఇది వ్యాపారానికి సరైన దృక్పథాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పంథాలో వినియోగించుకోవడానికి వీలుకల్పిస్తోందని ఆయన అన్నారు. గతంలో క్లిష్టమైన వినియోగదారుడి రుణాలు ఇచ్చేందుకు కనీసం 3 నుంచి 4 రోజులు పట్టేదని, అయితే ప్రస్తుతం తమ కంపెనీ కల్పిస్తున్న సదుపాయంతో ఓ వినియోగదారుడు క్రికెట్ మ్యాచ్ వంటి సమయాల్లో ప్లాస్మా టీవీని ఆస్వాదించాలన్న అనుభూతిని వెంటనే సొంతం చేసుకోగలుగుతున్నాడని ఆయన చెప్పారు.
తలసరి ఆదాయం పెంపు
సంతోషమే పరమావధి: నారా లోకేష్
ఇదే సెషన్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచడం, సంతోషాలను పంచడం పరమావధిగా ముందుకెళుతున్నామన్నారు. ప్రభుత్వం సైతం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ లక్ష్యాల సాధనకు పెద్దయెత్తున డేటాను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధనంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ‘మా చిన్న మజీలో ఎంతో సంతృప్తికర లక్ష్యాన్ని సాధించామ’ని ఆయన వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల పనితీరులో నిపుణతను పాదుకొల్పేందుకు పెద్దయెత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని అన్నారు.