బిజినెస్

బుల్ డల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్న్‌క్రు ఏమాత్రం కొనసాగకపోవడంతో బుధవారం భారీగా నష్టాలను ఎదుర్కొంది. సెనె్సక్స్ ఏకంగా 336.17 పాయింట్లు పతనమై 36,108.75 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో నష్టాలను ఎదుర్కొంది. 91.25 పాయింట్లు పతనం కావడంతో 10,831.50 పాయింట్లకు చేరింది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటే, ఇరు దేశాల మధ్య జరగాల్సిన అధికారుల సమావేశం రద్దయిందన్న వార్త ప్రకంపనలను సృష్టించింది. ఈ వార్తలో వాస్తవం లేదని అమెరికా ప్రకటించేలోపుగానే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌పై ఈ వార్త తీవ్ర ప్రభావం చూపింది. మదుపరుల భయాందోళనల నడుమ ట్రేడింగ్ కొనసాగింది. ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా, మదుపరులు స్టాక్స్ కొనుగోళ్లపై ఆసక్తి చూపలేదు. పైగా, అమ్మకాలకు మొగ్గు చూపారు. సంస్థాగత మదుపరులు కొంత వరకూ ఆదుకున్నప్పటికీ, మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయారు. ఒకానొక దశలో ట్రేడింగ్ అత్యధికంగా 36,521 పాయింట్లకు చేరినప్పటికీ, ఎక్కువ సేపు అక్కడ నిలవలేదు. అంతర్జాతీయ సూచీలు పతనం కావడంతో, బీఎస్‌ఈలోనూ కొనుగోళ్ల ఒత్తిడి పెరిగి, స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.