బిజినెస్

ఎస్ బ్యాంక్ ఎండీగా రవ్‌నీత్ గిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 24: ప్రైవేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జికూటివ్‌గా రవ్‌నీత్ సింగ్ గిల్ గురువారం నియమితులయ్యారు.
ఆయన ప్రస్తుతం డస్చ్ బ్యాంక్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం యెస్ బ్యాంకు ఎండీగా ఉన్న రాణాకపూర్ పదవీ కాలం ఈనెల 31తో ముగియనుంది. తన మరదలు బిందు కపూర్‌తో కలిసి యెస్ బ్యాంకు ప్రగతికి కృషి చేస్తున్న రాణాకపూర్‌ను ఈ నెలాఖరులోగా పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా రిజర్వుబ్యాంకు ఆదేశించింది.
అలాగే కొత్త ఎండీ కం సీఈవోగా రవ్‌నీత్ గిల్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు సైతం రిజర్వుబ్యాంకు తెలిపిన ఆమోదం తాలూకు ఆదేశాలు యెస్ బ్యాంకుకు అందాయి. మార్చి 1నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని బ్యాంకు గురువారం నాడొక ప్రకటనలో తెలిపింది. అలాగే అంతర్గత లావాదేల విషయం చర్చించేందుకు ఈనెల 29న బ్యాంకు బోర్డు సమావేశమవుతుందని వివరించింది. కాగా గురువారం ఈ బ్యాంక్ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక్కో షేర్ రూ.225.95 ట్రేడయింది.
త్రైమాసిక లాభాల్లో తగ్గుదల
ఈ బ్యాంకు త్రైమాసిక గణాంకాలను గురువారం ప్రకటించింది. గత డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో లాభాల్లో 6.96 శాతం తగ్గినట్టు అధికారులు వివరించారు. అంతకు క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,076.87 కోట్లతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన 1,001.85 కోట్ల రూపాయలు 6.96 శాతం తక్కువని అధికారులు వివరించారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.550.2 కోట్లు కేటాయించడం జరిగింది. వత్తిడికి గురైన వౌలిక అంశాల సమ్మేళనానికి, పునరుద్ధరణకు రూ.570.8 కోట్ల రూపాయలు కేటాయించినట్టు బ్యాంకు వివరించింది. ఐతే ఆ సమ్మేళనం ఎలా జరుగుతుందో వివరించలేదు. కాగా ఇయన్ ఆన్ ఇయర్ ప్రాదిపదికన ఈ బ్యాంకు స్థూల వడ్డీ ఆదాయం 41.2 శాతం పెరిగి రూ.2,666.4 కోట్లకు చేరింది. అలాగే ఇచ్చిన రుణాలు 42.2 శాతం పెరిగి మొత్తం రూ.2,43,885కు చేరింది. ఈ బ్యాంకు నిరర్థక ఆస్తులు గడచిన త్రైమాసికంలో 2.1 శాతం పెరిగాయి.