బిజినెస్

అమెరికాలో ఇన్ఫోసిస్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: అమెరికాలో ఇన్ఫోసిస్ హవా కొనసాగుతున్నది. అక్కడి స్థానికులకు పది వేల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే నాలుగింటి మూడు వంతులు, 7,600 మందికిపైగా ఉద్యోగులు అమెరికాలో పని చేస్తున్నారు. అత్యంత విస్తారమైన మార్కెట్ ఉన్న కారణంగా, అమెరికాలో ఇన్ఫోసిస్ వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది. ఇంత వరకూ ఐదు ఐటీ హబ్స్‌ను తెరిచింది.
స్థానిక కళాశాలలు, విద్యాలయాల్లో చదివిన వారికే అధిక ప్రాధాన్యం ఇస్తూ, అమెరికాలో మార్కెట్‌ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ కంపెనీకి ఉత్తర అమెరికాలో గట్టిపట్టు ఉంది. ఈ కంపెనీ మొత్తం వ్యాపారంలో 60.4 శాతం వాటా ఉత్తర అమెరికాదే కావడం గమనార్హం. ఐరోపా వాటా 24.2 శాతం. మిగతా దేశాల్లో 12.8 శాతంగా ఉంది. ఇన్ఫోసిస్ వ్యాపారంలో భారత్ వాటా కేవలం 2.6 శాతం. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించింది. స్థానికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, అందులో భాగంగానే అమెరికాలో కూడా స్థానికులకే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సలీల్ పరేఖ్ ఇటీవల చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను అందుకోవడానికి ఇన్ఫోసిస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నది. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని, 2020-21 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో స్థానికతను అమలు చేయాలని నిర్ణయించింది.
నిలకడగా వ్యాపార లావాదేవీలను విస్తరించుకుంటూ, గమ్యాలవైపు అడుగులు వేస్తున్నది. అమెరికాలో ఇప్పటికే ఐదు హబ్స్‌తో మార్కెట్‌లోకి విస్తరిస్తున్న ఇన్ఫోసిస్ తాజాగా ఇండియానాపొలిస్ (ఇండియానా), రాలే (నార్త్ కరోలినా), హార్ట్ఫోర్డ్ (కనిక్టికట్), ఫోనిక్స్ (ఆరిజోనా) నగరాల్లోనూ ఐటీ హబ్స్‌ను తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నది. రోడ్ ఐలాండ్‌లోని ప్రావిడెన్స్‌లో డిజైన్ అండ్ ఇన్నోవేటివ్ హబ్‌ను త్వరలోనే మొదలుపెట్టనుంది. అమెరికాతోపాటు యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియాల్లోనూ స్థానికంగా అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకుంటున్నది. ఈ విధంగా స్థానికంగా స్థిరపడడమేగాక, వ్యాపారాన్ని సులభంగా విస్తుృతం చేసుకుంటున్నది. 2020 సంవత్సరం నాటికి ఆస్ట్రేలియాలో మూడు ఇన్నోవేటివ్ హబ్స్‌ను మొదలుపెట్టి, కనీసం 1,200 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇతర భారతీయ ఐటీ కంపెనీలతో పోలిస్తే, ఉద్యోగ కల్పనలో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలుస్తోంది.