బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మెరుగుపడ్డాయ. రిలయన్స్, ఐటీసీ, యెస్ బ్యాంకు వంటి పెద్ద సంస్థలు లాభాలను సంతరించుకోగా బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెనె్సక్స్ 260 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 36,146.55 పాయింట్లతో ఆరంభమైన సెనె్సక్స్ తర్వాత ప్రతికూల పరిస్థితులెదురవడంతో ఒక దశలో 36,000కు దిగివచ్చింది. ఆ తర్వాత షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో మధ్యాహ్నం తర్వాత 86.63 పాయింట్లు ఎగబాకింది. చివరికి 36.195.10 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ సైతం కొంత ఊగిసలాటకు గురైనా తర్వాత 18.30 పాయింట్లు లాభపడి 10,866.35 వద్ద ముగిసింది. కాగా గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లు 470 పాయింట్లు నష్టపోవడం జరిగింది. దేశంలో అత్యంత అధిక మార్కెట్ విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడు నెలల గరిష్ట స్థాయి లాభం 1.61 శాతం అందుకుంది. అలాగే ప్రైవేటు రంగ బ్యాంకు యెస్ బ్యాంకు 8.39 శాతం అదనపులాభాలను ఆర్జించింది. ఈ బ్యాంకుకు రానా కపూర్ స్థానంలో డస్చ్ బ్యాంకుకు నేతృత్వం వహిస్తున్న రవ్‌నీత్ సింగ్ గిల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితులయ్యారు. వచ్చేనెల 1 నుంచి గిల్ బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో మార్కెట్‌లో సానుకూలతలు నెలకొన్నాయి. అలాగే సిగరెట్ల తయారీ కంపెనీ ఐటీసీ వాటాలు సైతం 0.43 శాతం అదనంగా లాభపడ్డాయి. త్రైమాసిక పనితీరును వెల్లడించిన అనంతరం బుధవారం ఈ కంపెనీ 4 శాతం నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. కాగా సెనె్సక్స్‌లో లాభపడిన కంపెనీల్లో టీసీఎస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, ఆసియన్ పెయింట్స్, హెచీసీఎల్ టెక్, వేదాంత లిమిటెడ్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. ఇవి 1.17 శాతం లాభపడ్డాయని మార్కెట్ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద గురువారం నాటి మార్కెట్ ట్రెండ్స్ ఆశాభావంగానే కొనసాగాయ.
నష్టాల్లో టాటా మోటార్స్..కోల్ ఇండియా
దేశీయ స్టాక్‌మార్కెట్లలో గురువారం టాటామోటార్స్, సన్‌పార్మా, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీ బ్యాంకు, టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు నష్టాలు చవిచూశాయి. ఈ కంపెనీలు దాదాపు 2.72 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీలకు రోజుమొత్తంలో ఏ దశలోనూ సానుకూల పరిస్థితులు కనిపించలేదు. కాగా అత్యధిక లాభాలు ఆర్జించిన రంగాల్లో రియల్ ఎస్టేట్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ ఉన్నాయి. రూపాయి విలువ తగ్గడంతోబాటు, దేశీయంగా అతిపెద్ద కంపెనీలు సానుకూల త్రైమాసిక ఫలితాలు సాధించడం ఐటీ స్టాక్స్ బలపడేందుకు దోహదం చేసిందని, అలాగే ద్రవ్య లభ్యత సరళతరం చేసే చర్యలకు కేంద్రం ఉపక్రమించిందన్న వార్తలతో పీఎస్‌యూ బ్యాంకు ల షేర్లకు ఊతం లభించిందని ఆర్థిక రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు.