బిజినెస్

జీఎస్‌కేసీహెచ్-హెయూఎల్ విలీనానికి సీసీఐ గ్రీన్ సిగ్నల్‌ః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్సూమర్ హెల్త్‌కేర్ (జీఎస్‌కేసీహెచ్) ఇండియా కంపెనీని హిందూస్థాన్ యూనీ లీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్)లో విలీనం చేసేందుకు సంబంధించిన పథకానికి వాణిజ్య నియంత్రణ విభాగం ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.31,700 కోట్ల వ్యాపారానికి సంబంధించిన ఈ పథకంపై ఈనెల 23న సీసీఐ ఆమోదముద్ర వేయగా ఆ పత్రాలు శుక్రవారం తమకు అందాయని జీఎస్‌కేసీహెచ్ ఇండియా తన రెగులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ పథకం సెబీ, ఎన్‌సీఎల్‌టీ వంటి మరికొన్ని నియంత్రణ విభాగాల ఆమోదం పొందాల్సివుందని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈ వంటి నియంత్రణ విభాలతోబాటు, హెచ్‌యూఎల్ వాటాదార్లు, రుణ దాతలు ఆమోదం, న్యాయపరమైన అంశాలు సైతం ఈ విలీన పథకంతో ముడిపడి ఉన్నాయని జీఎస్‌కేసీహెచ్ తెలిపింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సీసీఐ ఆమోదం లభించడం ఆనందంగా ఉందని పేర్కొంది. కాగా ఆంగ్లో డచ్ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనీలీవర్ పలు హెల్త్ఫుడ్ పోర్ట్‌పోలియో సంస్థల నిర్వహణను చేపట్టనున్నట్టు, అందులో భారత్‌లో పేరెన్నికగన్న బ్రాండ్లు హార్లిక్స్, బూస్ట్ వంటివికూడా ఉన్నాయని, గ్లాక్సోస్మిత్‌క్లైన్ నుంచి వీటిని సమీకరించనున్నామని గత డిసెంబర్ 3న ప్రకటించింది. అంతేకాక మరో 20 ఇతర మార్కెట్ల నుంచి సైతం మొత్తం 3.1 బిలియన్ పౌండ్లు (రూ.27,750 కోట్లు) ఖర్చుతో జరిగే ఈ ప్రణాళికను రూపొందించే పనిలో ఉన్నామని వివరించింది. ఈ డీల్‌లో భాగంగా యూనీలీవర్‌కు చెందిన భారతీయ విభాగం హెచ్‌యూఎల్ జీఎస్‌కే సీహెచ్ ఇండియాను అన్ని వాటాల విలీనం ద్వారా నిర్వహణను చేపట్టనుంది.