బిజినెస్

దేశంలో సేవలు విస్తరించనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 25: కొన్ని విదేశీ బ్యాంకుల తరహాలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషన్ (ఎస్‌బీఎం) సైతం ఆరోగ్యప్రదమైన, విశాల దృక్పథంతో భారత్‌లో వ్యాపార విస్తరణకు పూనుకుంది. వచ్చే రెండేళ్లలో తన శాఖా కార్యాలయాలను ద్విగుణీకృతం చేసి రుణాల పంపిణీని రూ.5వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1994 నుంచి ఇక్కడ ఓ శాఖా కార్యాలయంగా సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం నాలుగు శాఖా కార్యాలయాలను నిర్వహిస్తోంది. 2018 మార్చి నాటికి సుమారు రూ.1,016 కోట్ల రుణాలను ఈ బ్యాంకు పంపిణీ చేసిందని ఆర్‌బీఐ గణాంకాల మేరకు తెలుస్తోంది. మరో నాలుగు కొత్త శాఖా కార్యాలయాలను ప్రారంభించేందుకు ఎస్‌బీఎం నిర్ణయించింది. గత గురువారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్ ఈ బ్యాంకు సరికొత్త నినాదంతోకూడిన వ్యాపారం ‘వోలీ ఓన్డ్ సబ్సిడరీ’ని ప్రారంభించారు. భారత కంపెనీలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన వాణిజ్య ఆర్థికావసరాలకు వెన్నుదన్నుగా నిలవాలని ఈ బ్యాంకు నిర్ణయించింది. అలాగే ఇండియా- ఆఫ్రికా వాణిజ్య కారిడార్‌కు చేయూతనిస్తున్నట్టు ఎస్‌బీఎం ఓ ప్రకటనలో తెలియజేసింది. భారత్‌కు సంబంధించినంత వరకు తమ బ్యాంకు సేవలను ‘వోలీ వోన్డ్ సబ్సిడరీ’గా మార్చుకునే నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఎస్‌బీఎం చైర్మన్ లీ క్వాంగ్‌వింగ్ తెలిపారు. రీటెయిల్ మార్కెట్, సహకార, వాణిజ్య ఫైనాన్సింగ్‌ల్లో సైతం మూలధన మార్కెట్లలో సరళతర వాణిజ్యం, అలాగే స్టాక్ బ్రోకింగ్, ఆస్తుల నిర్వహణ, సంప్రదాయ వ్యాపారాలకు చేదోడుగా నిలవాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలావుండగా 2008లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ విదేశీ బ్యాంకులను సైతం ‘వోలీ వోన్డ్ సబ్సిడరీస్’గా రూపాంతరం చెంది దేశంలో సేవలందించేందుకు అనుమతించింది. తద్వారా అంతర్జాతీయంగా ఉన్న కఠినతర నిబంధనలను సడలించినట్టయింది. అప్పటి నుంచి ఎస్‌బీఎంతోబాటు, సింగపూర్‌కు చెందిన డీబీఎస్ ముందుకు వచ్చాయి.