బిజినెస్

ఆటుపోట్ల మధ్య అత్తెసరు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 6: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం పలికిన క్రమంలో వరుస నష్టాలకు బ్రేక్ పడినప్పటికీ, చెప్పుకోదగ్గ లాభాలు మాత్రం రాలేదు. నిజానికి జిఎస్‌టి కంటే కూడా విదేశీ పరిణామాలు గడచిన వారం భారతీయ మార్కెట్లపై అధిక ప్రభావం చూపడం గమనార్హం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తమ కీలక వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆశించినదాని కంటే ఎక్కువగా ఉద్దీపనలు ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. యూరోజోన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉద్దీపనలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని మెజారిటీ మదుపరులు విశ్వసించారు. ఈ క్రమంలోనే భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరులు పెట్టుబడులు తీసుకురాగా, దేశీయ మదుపరులు కూడా అదే బాటలో నడిచారు. దీంతో ఆరంభంలో నష్టాల్లో నడిచిన సూచీలు చివర్లో లాభాలను అందుకున్నాయి. దీంతో గడిచిన వారం మొత్తంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26.49 పాయింట్లు పెరిగి 28,078.35 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 44.65 పాయింట్లు అందుకుని 8,683.15 వద్ద నిలిచింది. మెటల్, ఆటో, పిఎస్‌యు, చమురు, గ్యా స్, ఐటి, టెక్నాలజీ, రియల్టీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, పవర్, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.30 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ 0.03 శాతం పడిపోయింది. టర్నోవర్ బిఎస్‌ఇ 17,92 5.47 కోట్ల రూపాయలు, ఎన్‌ఎస్‌ఇ 1,08,357.42 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ రూ. 19,207.06 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ రూ. 1,22,169.73 కోట్లుగా ఉన్నాయి.