బిజినెస్

విద్యుదుత్పత్తిలో మరో రికార్డు సృష్టించిన ఎన్టీపిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 28: ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో రామగుండం ఎన్టీపిసి గడువుకు మూడురోజుల ముందే 20,030 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిపి మరో రికార్డును సృష్టించింది. సోమవారం ఉదయం 10.30 గంటల వరకే నిర్ణయించిన వార్షిక ఉత్పత్తి 20,030 మిలియన్ యూనిట్లను అధిగమించడంతో ఎన్టీపిసి ఇడి ప్రశాంత్ కుమార్ మహాపాత్ర ఉద్యోగులను అభినందించారు. అందరి సమష్టి కృషి వల్లనే విద్యుదుత్పత్తిని సాధించగలిగామన్నారు. ఇదే ఐక్యతతో విద్యుదుత్పత్తి లక్ష్యాలను యేటా అధిగమించేందుకు కృషి చేయాలని ఆయన ఉద్యోగులను కోరారు. 2,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుపుతూ దక్షిణాది రాష్ట్రాలకు నిరాటకంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న రామగుండం ఎన్టీపిసిలోని 500 మెగావాట్లకు చెందిన 4 విద్యుత్ యూనిట్లు, 200 మెగావాట్లకు చెందిన 3 విద్యుత్ యూనిట్లు, 88.55 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్ట్ (పిఎల్‌ఎఫ్)తో విద్యుదుత్పత్తి జరిపి, థర్మల్ విద్యుత్ కేంద్రాలలో రామగుండం ఎన్టీపిసిని అగ్రస్థానంలో నిలిపాయ. కాగా, గడచిన ఆర్థిక సంవత్సరాల నుండి విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రామగుండం ఎన్టీపిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ఈసారి కూడా విద్యుదుత్పత్తిలో మరో అవార్డును అందుకునేందుకు అర్హత సాధించింది.

చిత్రం రామగుండం ఎన్టీపిసి విద్యుత్ ప్లాంట్