బిజినెస్

ఆంధ్రా బ్యాంక్‌కు మొండి బకాయల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంకు నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో ఏకంగా 84 శాతం క్షీణించింది. 31.09 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్- జూన్‌లో 202 కోట్ల రూపాయల లాభాన్ని పొందినట్లు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సురేష్ ఎన్ పటేల్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. నికర నిరర్థక ఆస్తులు 2.99 శాతం నుంచి 6.21 శాతానికి, స్థూల నిరర్థక ఆస్తులు 5.75 శాతం నుంచి 10.30 శాతానికి పెరిగాయన్నారు. కాగా, బ్యాంక్ ఆదాయం 4,855.50 కోట్ల రూపాయలకు పెరిగిందని, నిరుడు 4,52 9.23 కోట్ల రూపాయలుగా నమోదైందని చెప్పారు. బ్యాంకు వ్యాపార లావాదేవీలు కూడా 13 శాతం పెరిగి నిరుడుతో పోల్చితే 2,79,226 కోట్ల రూపాయల నుంచి 3,15,496 కోట్ల రూపాయలకు పెరిగాయి. అలాగే మొత్తం డిపాజిట్లలో వృద్ధిరేటు 16.2 శాతం నమోదైంది.

చిత్రం..విలేఖరుల సమావేశంలో బ్యాంక్ ఎండి, సిఇఒ సురేష్ ఎన్ పటేల్ (మధ్యలో)